కొన్నాళ్ళు ఘాడంగా ప్రేమించుకుని ఏ కారణం లేకుండా సడెన్ గా విడిపోయిన సిద్ధార్థ్, సమంతలు ఇప్పుడు ఎవరికి వారు సినిమాలు చేసుకుంటూ ఉంటున్నారు. సినిమాలైతే చేస్తున్నాడు కాని సిద్ధార్థ్ హిట్ మార్క్ టచ్ చేసి చాలా రోజులైంది. ఇక సమంత గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. వరుసెంట క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఫుల్ ఫాంలో ఉంది అమ్మడు. ఇద్దరు విడిపోయినా సిద్ధార్థ్ సినిమా ఏదన్న వస్తే ఎంతైనా ఒకప్పుడు ప్రేమికుడు కదా అని అమ్మడు జాలి తలచి ట్విట్టర్లో అతని సినిమా గురించి పాజిటివ్ కామెంట్స్ తో ప్రచారం చేస్తుంది సమంత.
సిద్దార్థ్ మాత్రం సమంత విషయంలో మాత్రం జోక్యం చేసుకోవట్లేదు. రీసెంట్ గా బాహుబలి, నాన్ రౌడీ థాన్ సినిమాలను మెచ్చుకుంటూ ట్వీట్ చేసిన సిద్ధూ సమంత ఎంత మంచి సినిమా తీసిన దాని గురించి మాత్రం ప్రస్థావించట్లేదు. రీసెంట్ గా దసరా కానుకగా రిలీజ్ అయిన 10 ఎన్రదుకుల్ల సినిమా హిట్టా ఫ్లాపా అన్నది పక్కన పెడితే సమంత నటనకు అందరు ఫిదా అయిపోతున్నారు.
విక్రం హీరోగా విజయ్ మిల్టన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను మురుగదాస్ నిర్మించడం విశేషం. అయితే చాలామంది సమంత మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నా సిద్ధార్థ్ మాత్రం నోరు విప్పలేదు. మరి దీనికి కారణం ఏమై ఉంటుందా అనేది వారిద్దరికే తెలియాలి. ఒకవేళ తనని విడిచి వెళ్లినందుకు సమంత మీద కోపంతో సిద్దార్థ్ సమంతని పొగడట్లేదు కావొచ్చు.