చంద్రబాబు: బ్రదర్ ఏమిటిది?
బ్రదర్: మట్టి..నీళ్ళు!
చంద్రబాబు: ఇదా నేను ఆయనని అడిగింది?
బ్రదర్: అదే కదా?
చంద్రబాబు: ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ కదా అడిగాను?
బ్రదర్: ఎప్పుడు?
చంద్రబాబు: ఎప్పుడేమిటి…డిల్లీ వెళ్ళినప్పుడల్లా అడుగుతూనే ఉన్నా కదా? తెలియనట్లు బ్రదర్: అడుగుతున్నావేమిటి..జగన్ లాగా?
బ్రదర్: కానీ మీరు అందరినీ మట్టి నీళ్ళే కదా తీసుకు రమ్మన్నారు. అందుకే మోడీ కూడా శ్రమ అనుకోకుండా అవే తీసుకువచ్చి మీ చేతుల్లో పెట్టారు. పైగా మీకు అర్ధం అవుతుందని శ్రమ అనుకోకుండా నేను సైతం అంటూ తెలుగులో మంచి కవిత్వం కూడా చెప్పారు..అప్పుడు మీరు కూడా చప్పట్లు కొట్టారు కదా?
చంద్రబాబు: అన్యాయం అన్యాయం…అయినా వీటిని నేనేమి చేసుకోవాలి?
బ్రదర్: దీనిలో అన్యాయం ఏముంది? రాజధానికి మంచి పవర్ రావాలంటే మట్టి-నీళ్ళు తెమ్మని మీరే కదా చెప్పారు. మీరే కదా హెలికాఫ్టర్లో వెళ్లి దానిని రాజధాని ప్రాంతంలో చెల్లారు. దీనిని అలాగే వెదజెల్లి..ఆ ఫోటోలను మోడీకి పంపండి ఆయన సంతోషిస్తారు…ట్వీటర్లో రిప్లై ఇస్తారు.
చంద్రబాబు: మరి హోదా, ప్యాకేజి మాటేమిటి?
బ్రదర్: ఇంక వాటి గురించి మరిచిపొండి.
చంద్రబాబు: అప్పుడు నా గురించి ప్రజలేమనుకొంటారు…జగన్ ఏమనుకొంటాడో?
బ్రదర్: మీరు ఇప్పటిలాగే రాజధాని మీద ఫోకస్ పెట్టి, ప్రజల దృష్టి కూడా దానిపైనే ఉండేలా చూసుకొండి చాలు.. ఎవరు ఏమనుకొన్నా భయం లేదు.
చంద్రబాబు: అంటే అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి హైప్ సృష్టించి ప్రజల దృష్టిని జగన్ దీక్ష నుంచి దానిపైకి మరల్చినట్లుగానా?
బ్రదర్: ఎగ్జాట్లీ!
చంద్రబాబు: థాంక్స్ బ్రదర్! ఇకపై అదే పని మీద ఉంటాను.
బ్రదర్: మరి పరిపాలన?
చంద్రబాబు: దానిదేముంది… నారాయణ అంతా చూసుకొంటున్నారు కదా?
బ్రదర్: ఒకవేళ వచ్చే ఎన్నికలలో ఆయనే మీకు పోటీగా తయారవుతారేమో…జాగ్రత్త బాబుగారు.
చంద్రబాబు: ఆ…ఆ…!!!