హైదరాబాద్: భారత పోలీసులు కొన్ని ఏళ్ళుగా చేయలేని పనిని ఆస్ట్రేలియా, ఇండోనేషియా పోలీసులు సంయుక్తంగా చేశారు. ఆ ఇరు దేశాల పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో పేరుమోసిన అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్‌ను ఇండోనేషియాలోని బాలి నగరంలో అరెస్ట్ చేశారు. ఛోటో రాజన్ గతంలో దావూద్ ఇబ్రహీమ్ ముఠాలో పనిచేశాడు. కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ ఈ విషాయన్ని నిర్ధారించింది. ఇతనిపై ముంబాయితోసహా పలు నగరాలలో అనేక కేసులు ఉన్నాయి. అక్రమ ఆయుధాలు సరఫరా చేసిన కేసులోకూడా ఇతను నిందితుడు. ఇతను 1995నుంచి పరారీలో ఉన్నాడు. ఇతని అసలు పేరు రాజేంద్ర సదాశివ్ నికల్జే. ఆస్ట్రేలియన్ పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఇతనిని అరెస్ట్ చేసినట్లు ఇండోనేషియన్ పోలీసులు చెప్పారు.