మలయాలం ప్రేమమ్ సినిమా ఎంత సంచలన విజయం దక్కించుకుందో తెలిసిందే.. చిన్న బడ్జెట్ తో రూపొందించబడ్డ ఆ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ సినిమాలో ఒకటిగా నిలిచింది. ఫీల్ గుడ్ లవ్ స్టొరీగా వచ్చిన ఈ సినిమాకు కేవలం మలయాళంలోనే కాదు సౌత్ అన్ని భాషల్లో క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం ఆ సినిమాను తెలుగులో నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో చేస్తుండగా.. అందులో నటించిన అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా చేస్తుంది. ఇక అదే సినిమాను తమిళ్ లో కూడా రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు ధనుష్.
ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరో పక్క చిన్న సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నాడు ధనుష్. రీసెంట్ గా విజయ్ సేతుపతి హీరోగా ధనుష్ నిర్మించిన నాన్ రౌడీ థాన్ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. అయితే ఇదే ఫాం కొనసాగిస్తూ విజయ్ సేతుపతి హీరోగా తమిళ ప్రేమమ్ తెరకెక్కించనున్నాడు ధనుష్. తెలుగులో ఆల్రెడీ చైతు చేస్తున్నాడు కాబట్టి అక్కడ రిలీజ్ అయ్యే చాన్స్ లేదు.
కమర్షియల్ హీరోగా సినిమాలు చేస్తూనే మంచి ఫీల్ గుడ్ మూవీస్ ని ప్రొడ్యూస్ చేస్తూ తన కంటూ ఓ స్పెషల్ క్రేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు ధనుష్.. అయితే మలయాళ ప్రేమమ్ సినిమా ధనుష్ ప్రొడక్షన్ లో రీమేక్ అవ్వడం ప్రేక్షకులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మొత్తానికి మలయాళం దృశ్యంలానే ప్రేమమ్ కూడా అన్ని సౌత్ భాషల్లో రీమేక్ అయ్యి సరికొత్త రికార్డుని సృష్టించబోతుందన్నమాట.