బాలీవుడ్, టాలీవుడ్ సాన్నిహిత్యం ఎప్పటినుండో నడుస్తున్నా ఈ మధ్య అది బాగా పెరిగిందని చెప్పొచ్చు. మన సినిమాలు అక్కడకు అక్కడ సినిమాలు ఇక్కడకు రావడంతో అందరు కలిసిపోయారు. మనదంతా సినిమా ప్రపంచం అని అందరు గుర్తించడం మెచ్చుకోదగ్గ విషయం. అయితే అదే దారిలో అక్కడ సినిమాలకు ఇక్కడ.. ఇక్కడ సినిమాలకు అక్కడ.. కావాల్సిన సహయాన్ని అందిస్తున్నారు. రీసెంట్ గా సల్మాన్ ఖాన్ నటించిన ప్రేమ్ రతన్ థన్ పాయో సినిమా తెలుగులో కూడా డబ్ చేస్తున్నారు.
తెలుగులో ప్రేమ్ లీలగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సల్మాన్ ఖాన్ కు తెలుగు డబ్బింగ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెప్పడం విశేషం. రీసెంట్ గా డబ్బింగ్ స్టార్ట్ చేసిన మన బ్రూస్ లీ నిన్నటితో దాన్ని కంప్లీట్ చేశాడట. చరణ్ డబ్బింగ్ చెప్పడంతో ప్రేమ్ లీలకు సూపర్ క్రేజ్ వచ్చింది. సూరజ్ భర్జత్యా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రాజశ్రీ ప్రొడక్షన్ నిర్మించింది.
సల్మాన్ ఖాన్, సోనం కపూర్ జంటగా నటించిన ఈ సినిమా దీపావళి నాడు గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. సల్మాన్ ఖాన్ బజరంగి భాయ్ జాన్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సూరజ్ భర్జత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా అజిత్ కుమార్ భర్జత్య, కమల్ భర్జత్య, రాజ్ కుమార్ భర్జత్య నిర్మిస్తున్నారు. అసలే దీపావళి నాడు రిలీజ్ కి రెడీ అయిన తెలుగు సినిమాలకు సల్మాన్ ఖాన్ ప్రేమ్ లీల కూడా పోటీలో నిలబడనుంది.