ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం రాష్ట్రంలో దేశవిదేశాలలో ఉన్న తెలుగువారు భారీగా విరాళాలు అందజేస్తున్నారు. దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక ఖాతాను తెరిచింది. మే 20వ తేదీ నాటికి మొత్తం రూ. 41,71,58,534 విరాళాలు అందాయి. ఆ మొత్తాన్ని ప్రభుత్వం సీఆర్డీఏ ఖాతాలోకి బదిలీ చేస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది.అదికాక సీఆర్డీఏ ప్రత్యేకంగా ప్రారంభించిన ‘మై బ్రిక్- మై అమరావతి’ వెబ్ సైట్ ద్వారా నిన్న రాత్రి వరకు రూ 3, 60, 09, 680లు విరాళాలు అందాయి. చిన్నారులు మొదలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంద్రులు చాలా మంది ఉడతా భక్తిగా రాజధాని నిర్మాణం కోసం యధాశక్తిగా విరాళాలు అందజేస్తున్నారు. అయితే ఆ జాబితాలో మన రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు లేకపోవడమే విచిత్రం.