బాహుబలి-2లో మాధురీ దీక్షిత్ ?

బాహుబలి పార్ట్ 1 బాలీవుడ్ లో కూడా సంచలనం సృష్టించడంతో , పార్ట్ 2 మరింత ఆకర్షణగా ఉండేలా దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బాహుబలి-1 హిందీ వర్షెన్ కి పంపిణీదారునిగా ఉన్న కరణ్ జొహర్ ఆమధ్య రాజమౌళితో తన మనోభావాలు పంచుకున్నారనీ, అందుకుతగ్గట్టుగానే రాజమౌళి బాహుబలి -2 (ముగింపు)లో నటీనటవర్గం ఎంపికలో బాలీవుడ్ స్టార్స్ ను కూడా దృష్టిలో ఉంచుకున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ మాధురీ దీక్షిత్ కు ఛాన్స్ ఇస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. బాహుబలి-2 కథ ప్రకారం దేవసేన (అనుష్క)కు సోదరి ఉంటుంది. ఆమె కుంతల రాజ్యానికి రాణి. ఆ పాత్రకు మాధురీ దీక్షత్ ను తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం రాజమౌళీ మాత్రం అధికారికంగా ఎక్కడా ప్రస్తావించలేదు.

భారతీయ సినీ పరిశ్రమలోనే బాహుబలి చిత్రం అద్భుతం సృష్టించింది. విడుదలైన తర్వాత ఆ చిత్రంలో తాము ఎందుకు నటించలేకపోయామా…అని చాలామంది అగ్రనటులు ఫీలయ్యారు. కొంతమంది బాహాటంగానే బాధపడ్డారు. అమితాబ్ వంటి అగ్రనటులు బాహుబలి చిత్రంపట్ల ప్రత్యేక ఆసక్తి చూపించారు. ఇక దక్షిణాదిన చాలామంది నటులైతే బాహుబలి-2లో అవకాశం ఇస్తే తాము నటించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేశారు. ఇలాంటి సినిమా తమకు వస్తే చాలా గర్వంగా ఫీలయ్యేవారమని రజనీకాంత్, సూర్యా, చిరంజీవి వంటివాళ్లుసైతం అనడం గమనార్హం.

మరో పక్క బాహుబలి -2 చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్-జులై లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలుచేస్తోంది. బాహుబలి-2తోనే కథ పూర్తవుతుందనీ, కథ పొడిగింపు ప్రసక్తేలేదని కొన్ని ఊహాగానాలకు తెరదింపారు రాజమౌళి.

అయితే, మరో పక్క బాహుబలి-3 ప్రసక్తి ఆయనే తీసుకువచ్చారు. బాహుబలి-3 కథాపరంగా ఉండదని, అయితే కొత్త ప్రపంచానికి బాహుబలి-3 తలుపులు తెరుస్తుందన్నట్టుగా రాజమౌళి మాట్లాడుతున్నారు. బాహుబలి-2 విషయంలోకానీ, లేదా బాహుబలి-3 విషయంలోగానీ రాజమౌళి ఎలాంటి స్పష్టమైన ప్రకటనలు చేయడంలేదు. చాలాగోప్యంగా సాగిపోతున్నారు. బాహుబలి పార్ట్ వన్ కి విజువల్ ఎఫెక్ట్స్ (విఎఫ్ఎక్స్) పర్యవేక్షకునిగా వ్యవహరించిన శ్రీనివాస్ మోహన్ కు బదులుగా బాహుబలి -2కి ఆర్.సి. కమలాకన్నన్ ను నియమించినట్లు ఈమధ్య మరో వార్త వచ్చింది. కమలాకన్నన్ గతంలో మగధీర, ఈగ సినిమాలకు విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ గా పనిచేశారు. అయితే శ్రీనివాస్ మోహన్ ని ఎందుకు తప్పించారన్నది చిత్ర యూనిట్ వర్గాలు బయటపెట్టడంలేదు. శ్రీనివాస్ మోహన్ కు ఓతమిళ చిత్రం పనులు ఉండటంతో ఈ ప్రాజెక్ట్ కు దూరమవుతున్నారరని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.

బాహుబలి -2 అనుకున్న సమయానికి అన్ని హంగులు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతుందని మాత్రం రాజమౌళి చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close