సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం బ్రహ్మోత్సవం సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా ఆ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో జాలీ ట్రిప్ వేసిన మహేష్ తను మురుగదాస్ తో తీసే సినిమా దాదాపు కన్ఫాం అయ్యినట్టే. మురుగదాస్ మహేష్ క్రేజీ కాంబోలో రాబోతున్న సినిమా న్యాయ వ్యవస్థ మీద జరుగుతున్న లొసుగులను తెరకెక్కించనున్నారట. మెగా సూపర్ గుడ్ మూవీస్ బ్యానర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్, పారాస్ జైన్లు నిర్మిస్తున్నారు.
అయితే ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమాలో మహేష్ తో జత కట్టే చాన్స్ కంచె హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ కొట్టేసిందట. కంచె సినిమాలో అటు నటనతో పాటుగా సాధ్యమైనంత వరకు తన అందాలతో కనువిందు చేస్తూ ప్రగ్యా ప్రేక్షకులను బాగానే అలరించింది. అయితే దాస్ సినిమాలో మహేష్ కు జోడీగా సూట్ అయ్యే లక్షణాలు ఉండటంతో ఆమెని ఓకే చేసే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు.
టాప్ హీరోయిన్స్ సైతం మహేష్ తో నటించడానికి క్యూలు కడుతుంటే కేవలం ఒక్క సినిమాతో భలే చాన్స్ కొట్టేసిందని అంటున్నారు సిని ప్రముఖులు. మహేష్ తో సినిమా అంటే దాదాపు స్టార్ హీరోయిన్ హోదా దక్కినట్టే.. మరి అమ్మడు వచ్చిన చాన్స్ ని నిలబెట్టుకుంటుందో లేదో చూద్దాం.