చిట్టి నడుము సుందరి ఇలియానా బాలీవుడ్లో క్లూడా ఫ్లాప్ అయ్యింది కాబట్టి మరోసారి తనకు స్టార్ స్టేటస్ ఇచ్చిన సౌత్ సినిమాలపై కన్నేసిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ క్రేజ్ ఉన్నప్పుడు అమ్మడు పెట్టిన ఇబ్బందుల వల్ల రాగానే ఇలియానాకు ఎవరు అవకాశాలు ఇవ్వలేదు సరికదా కనీసం ఆమెను చూడను కూడా చూడలేదు దర్శక నిర్మాతలు. బ్రూస్ లీ సినిమాలో చరణ్ తో ఐటం అని అప్పటిలో హడావిడి చేశారు. బ్రూస్ లీ ప్రొడ్యూసర్ దానయ్య ఇలియానాకి అవకాశం ఇస్తున్నాడని అన్నారు. తీరా మైనదో ఏమోగాని సినిమాలో ఇల్లి బేబీకి హ్యాండ్ ఇచ్చేశారు.
చరణ్ తీయబోయే తర్వాత సినిమాలో ఇలియానానే హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట. తని ఒరువన్ తెలుగు రీమేక్ చేస్తున్న చెర్రి ఈ సినిమాతో ఇలియానాకు గ్రాండ్ రీ ఏంట్రీ ఇప్పించే ఏర్పాటు చేస్తున్నాడట. రాక రాక అవకాశం వస్తుంది కాబట్టి ఈ సినిమాలో ఇల్లి బేబ్ రెచ్చిపోతుందని అంటున్నారు. రేసుగుర్రం డైరక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా త్వరలో స్టార్ట్ అవ్వనుంది.
ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇలియానా ఎంట్రీ పక్కా అని అంటున్నాయి ఫిల్మ్ నగర్ సర్కిల్స్. ఫేడ్ అవుట్ హీరోయిన్ ఇలియానాకి తెలుగులో రాణించడానికి ఇదో గొప్ప అవకాశం అని చెప్పొచ్చు. మరి వచ్చిన ఈ గొప్ప అవకాసాన్నైనా అమ్మడు కెరియర్ చక్కబడేలా చేసుకుంటుందో లేదో చూద్దాం.