మెగా ఫ్యాన్స్ లో ఏర్పడ్డ చీలికను తన వంతుగా కలిపేందుకు ఒక చిన్న పాటి మెగా ఫ్యాన్స్ మీటింగ్ ను ఏర్పాటు చేశాడు అల్లు అర్జున్. స్టైలిష్ స్టార్ గా అభిమానులను అలరిస్తున్న బన్నీ ప్రతి ఒక్క విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉండాలను కోరుకుంటాడు. అయితే ఈ మధ్య పరిస్థితుల కారణాల వల్ల మెగా ఫ్యాన్స్ లో క్రమశిక్షణ లోపించిందని గమనించిన బన్నీ మీటింగ్ ఏర్పాటు చేసి క్లాస్ పీకాడట. అంతేకాదు మెగా ఫ్యామిలీ అంతా ఒకటే నని.. ఫ్యాన్స్ మధ్య గొడవలు వద్దు అని చెప్పాడట.
ఈ మధ్య మెగా ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటూ ఒక కొత్త ఆలోచనని రేకెత్తిస్తున్న ఈ సందర్భంలో అలాంటివేమీ లేవనే చెప్పే ప్రయత్నం చేయసాగాడు అల్లు అర్జున్. అంతేకాదు మెగా ఫ్యామిలీ నుండి ఏ హీరో సినిమా వచ్చినా బ్యానర్లలో మెగాస్టార్ ఫోటో ఖచ్చితంగా పెట్టాలని వార్నింగ్ ఇచ్చాడట.
మెగాస్టార్ వల్లే తామంతా ఇంత మంచి పొజిషన్లో ఉన్నామని కాబట్టి ఆయన ఫోటో లేకుంటే ఊరుకునేది లేదని గట్టిగా చెప్పాడట. అయితే అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ తో పెట్టిన ఈ రహస్య సమాహారం కేవలం ఫ్యాన్స్ కి వార్నింగ్ ఇవ్వడం కోసమేనా లేక ఇంకా వేరే ప్లాన్ ఏదైనా ఉందా అన్నది తెలియాల్సి ఉంది.