రాజమౌళి ప్రస్తుతం ఫైట్ ఫర్ స్మోకింగ్ అనే నినాదంతో ముందుకు వస్తున్నాడు. అమెరికన్ ఆంకాలజీ ఇన్స్ ట్యూట్ తరపున వారు ఏర్పాటు చేసిన ప్రోగ్రాం ద్వారా తన సందేశాన్ని అందించాడు రాజమౌలి. ప్రతి మనిషి జీవితంలో తనకు తానే రియల్ హీరో.. అలా ఉండాలంటే వారు పొగ త్రాగడం మానేయాలని సూచించారు. స్మోక్ ఏ ఫ్రీగా ఉండి తమని తమ కుటుంబాన్ని కాపాడుకోవాలని సూచించాడు రాజమౌలి.
రాజమౌళి మాటలతో చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ సైట్స్ లో హల్ చల్ చేస్తుంది. ఇది ఒక ఉద్యమంగా సాగాలనే ఉద్దేశంతోనే రాజమౌళి ద్వారా ప్రమోషన్ ఇప్పిస్తున్నారు. రాజమౌళి సపోర్ట్ చేస్తున్న ఈ కార్యక్రమంలో భవిష్యత్తులో పలు కార్యక్రమాలు చేపట్టే ఆలోచనలో ఉన్నారు అమెరికన్ ఆంకాలజీ ఇన్స్ ట్యూట్ వారు. మరి రాజమౌలి ఇచ్చిన ఈ పిలుపుతో ఎంతమంది తమకు తాముగా పొగ త్రాగడం మానేసి రియల్ హీరోగా మారుతారో చూడాలి. ప్రస్తుతం బాహుబలి సెకండ్ పార్ట్ షూటింగ్ కు లొకేషన్ వేటలో ఉన్న రాజమౌలి డిశెంబర్లో సినిమాను స్టార్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.
https://www.youtube.com/watch?v=zmtUGi6943Q