హైదరాబాద్: వరంగల్ లోక్సభ ఉపఎన్నికకు ఎన్డీఏ అభ్యర్థిగా ఎన్ఆర్ఐ డాక్టర్ దేవయ్య పేరు ఖరారయ్యింది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం సుదీర్ఘంగా కసరత్తు చేసి దేవయ్య పేరును ఖరారు చేసింది. అయితే దేవయ్య అభ్యర్థిత్వంపై బీజేపీలో అసంతృప్తి ఉన్నట్లు చెబుతున్నారు. ఎంతోకాలంగా పార్టీలో పనిచేస్తున్నవారిని వదిలి కొత్తగా వచ్చినవారికి టికెట్ ఇవ్వటమేమిటని కొందరు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, స్థానికంగా ప్రముఖుడు డాక్టర్ రాజమౌళి పేర్లనుకూడా బీజేపీ నేతలు పరిశీలించారు. దేవయ్య ఈ నెల 4న బీజేపీ, టీడీపీ కార్యకర్తలతో భారీ ప్రదర్శనగా వెళ్ళి నామినేషన్ దాఖలు చేయనున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా పసునూరి దయాకర్, కాంగ్రెస్ అభ్యర్థిగా రాజయ్య పేర్లు ఇప్పటికే ఖరారైన సంగతి తెలిసిందే.