హైదరాబాద్: 2000 సంవత్సరంనుంచి ఐఫా పేరుతో అవార్డ్లు ఇస్తున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ, ఈ ఏడాదినుంచి సౌత్‌లో కూడా అవార్డ్లు ఇవ్వనుంది. ఐఫా ఉత్సవం పేరుతో జరిగే ఆ అవార్డ్‌ల కార్యక్రమం డిసెంబర్ 6 నుంచి మూడురోజులపాటు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతుంది. ఆ కార్యక్రమ కర్టన్ రైజర్ ఇవాళ పార్క్ హయత్ హోటల్లో జరిగింది. కమల్ హాసన్, నాగార్జున, వెంకటేష్, మంత్రులు కేటీఆర్, తలసాని, తమన్నా, అల్లు అరవింద్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని అన్నివిధాలా ది బెస్ట్ అనిపించేలా జరిపేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని ఐఫా నిర్వాహకులు చెప్పారు.
మరోవైపు ఈ కార్యక్రమంలో తమన్నాయే కేంద్రబిందువుగా మారింది. ఆమె ఈ కార్యక్రమానికి ధరించిన డ్రస్, ఆమె డ్రస్ సెన్స్ చర్చనీయాంశంగా మారింది. ఒక అఫిషియల్ కార్యక్రమంలాగా జరుగుతున్న ఈ కర్టన్ రైజర్‌కు తమన్నా రివీలింగ్‌గా, పూర్తి ట్రాన్సపరెంట్గా ఉన్న గౌన్‌ను, అదీ బ్రాకూడా లేకుండా ధరించి వచ్చింది. ఆ కార్యక్రమంలో ఆలీ లేడుగానీ, ఉండి ఉంటే తమన్నాను రచ్చరచ్చ చేసేవాడు!