వెన్నెల సినిమాతో పరిచయమైన కమెడియన్ కిశోర్ ఆ సినిమా తర్వాత తన ప్రస్థానన్ని సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నాడు. వెన్నెల సినిమాతో తన స్క్రీన్ నేమ్ ని వెన్నెల కిశోర్ గా పెట్టుకున్న కిశోర్ కామెడీ పంచ్ అందరిని ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు షేర్ చేసుకున్నాడు. యూఎస్ లో జాబ్ చేస్తున్న తను సడెన్ గా సినిమాల్లోకి వచ్చాననీ. వెన్నెల సినిమాలో ఆ క్యారక్టర్ కు మిమిక్రీ ఆర్టిస్ట్ శివా రెడ్డి రావాల్సి ఉండగా.. అనుకోని పరిస్థితుల్లో అతని ఆగాల్సి వచ్చిందట.
ఎవరిని పెట్టాలో తెలియని దేవా కట్ట అప్పటికప్పుడు కిశోర్ ని చూసి సెలెక్ట్ చేశాడట. అయితే ఆ సినిమా తర్వాత ఎన్ని సినిమా ఆఫర్లు వచ్చినా నో చెప్పాడట. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి మురుగదాస్ సినిమాలో చిరు పక్కన నటించే చాన్స్ వచ్చినా సరే ఉద్యోగం కోసం కాదన్నాడట. అయితే ఆ తర్వాత నాగ సుశీల కోరిక మేరకు సుశాంత్ కరెంట్ సినిమాలో నటించానని.. ఇక దానితో అవకాశాలు వెళ్లువల్లా వచ్చి పడ్డాయని అంటున్నాడు.
మొత్తానికి జాబ్ కోసం చిరు సినిమానే వదిలేసిన కిశోర్ అప్పుడు హ్యాపీగా ఫీల్ అయినా ఇప్పుడు మాత్రం అర్రే మంచి చాన్స్ మిస్ చేసుకున్నాం కదా అని ఫీల్ అవుతున్నాడట.