బాలీవుడ్ హాట్ హీరోయిన్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు కంగనా రనౌత్. అమ్మడు సినిమాల్లో రెచ్చిపోవడమే కాదు ఆఫ్ స్క్రీన్ మాటలు కూడా టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తాయి. మొన్నటిదాకా హీరోయిన్స్ అంటే దర్శక నిర్మాత్ల చేతిలో ఆటబొమ్మలే అని హాట్ కామెంట్స్ చేసిన కంగనా ఇప్పుడు మరో అద్భ్హుతమైన క్యారక్టర్ ని ఓకే చేసిందట. రీసెంట్ గా తను వెడ్స్ మను రిటర్న్ హిట్ తో మంచి జోష్ మీదున్న కంగనా రనౌత్ శేఖర్ సినిమాలో 85 ఏళ్ల వృద్ధురాలి క్యారక్టర్లో కనిపించనున్నదట.
ఏంటి హాట్ క్వీన్ గా ఉండే కంగనాని వృద్ధురాలి గెటప్‌లో చూపించడమా శేఖర్ కపూర్ కి ఇది ఓ పెద్ద సవాలే అంటున్నారు బాలీవుడ్ ప్రేక్షకులు. అద్భుతమైన కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడట శేఖర్ కపూర్. 17 వ జియో మామి ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న ఈ సినిమాలో నటిస్తుందని తానే స్వయంగా చెప్తూ.. శేఖర్ కపూర్ తో చేసే సినిమా విషయాన్ని ప్రస్థావించింది.
ఇంత చెప్పిన కంగనా ఆ సినిమా టైటిల్ మాత్రం ఇంకా నిర్ణయించలేదని అంటుంది. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇంకా డిస్కషన్ స్టేజ్‌లోనే ఉందట. సో కంగనా 85 ఏళ్ల వృద్ధిరాలిగా అంటే బాలీవుడ్ ప్రేక్షకులకు కాస్త స్టన్ అవుతున్నారు. మరి వృద్ధిరాలిగా ఈ బక్క పలుచ సుందరి ఎలా కనిపించనుందో చూడాలి.