మడికట్టుకు కూర్చుంటే గ్లామర్ ఇండస్ట్రీలో కష్టమే.. ముఖ్యంగా హీరోయిన్స్ అన్న తర్వాత కాస్తంత హాట్ హాట్ గానే కనపడాలి. కాని మరీ అంతా గ్లామర్ షో చేయకుండానే హీరోయిన్ గా చెలామణి అవుతున్న భామలు ఉన్నారు. అవసరం ఉన్నా లేకున్నా విచ్చల విడిగా అందాలు ప్రదర్శిస్తున్న భామలున్న ఈ రోజుల్లో కేవలం పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమానే చేసుకుంటూ వచ్చింది కలర్స్ స్వాతి. కలర్స్ అనే బుల్లితెర ప్రోగ్రాంతో ఆడియెన్స్ కు దగ్గరైన ఈ భామ సినిమాల్లో చాలా పద్ధతిగా కనిపిస్తుంది.
అమ్మడు సెలెక్ట్ చేసుకునే సినిమాలు కూడా గ్లామర్ షో కన్నా.. యాక్టింగ్ స్కోప్ ఉన్నవే ఎక్కువగా ఉండేవి. స్వామిరారా, కార్తికేయ హిట్స్ తో జోష్ మీదున్న ,స్వాతి.. ప్రస్తుతం అదే ఫాంతో హిట్స్ మీద హిట్స్ కొడుతుంది. ఇప్పుడు త్రిపురతో ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అయితే త్రిపుర సినిమా ప్రమోషన్లో పాల్గొన్న స్వాతి ఆ సినిమా విశేషాలతో పాటు చాలా విషయాలను బయటపెట్టింది. ఇక అదే మాటల్లో గ్లామర్ షో కి మీరు దూరమా అని రిపోర్టర్ అడిగితే.. ఎవరన్నారండి నేను గ్లామర్ షో చేయనని.. నాకు వచ్చే కథలన్ని ఇలానే వస్తున్నాయి. ఓ సారి గ్లామర్ పాత్ర రానివ్వండి నేనేంటో చూపిస్తా అంటూ రెచ్చిపోయింది. అమ్మడు ఇలా అంటుందంటే పొరపాటున ఏ దర్శకుడైనా గ్లామర్ పాత్ర ఇస్తే బోల్డ్ గా నటించడానికి కూడా వెనుకడుగు వేసేట్టు లేదు స్వాతి అని అనుకుంటున్నారు సిని వర్గాలు.