కాదేది కవితకు అనర్హం అని అన్నారు పెద్దలు. అలానే స్టార్ హీరోల సినిమాలంటే కాదేది రికార్డులకు అనర్హం అనేలా చేస్తున్నారు. మొన్నటిదాకా సినిమా రికార్డ్ అంటే కలెక్షన్స్ అని చెప్పుకునే వారు. కాని ప్రస్తుతం సాంకేతికత పరిజ్ఞానంతో ప్రేక్షకులు తమ స్టార్ హీరో సినిమా కొత్త అంశాలతో రికార్డ్ నెలకొల్పాడని రచ్చ చేస్తున్నారు. మొన్నటిదాకా కలెక్షన్స్ రికార్డులు, థియేటర్లో ఆడిన రికార్డులే పరిగణలో తీసుకునే ఫ్యాన్స్ ఇప్పుడు తమ స్టార్ హీరో సినిమా బుల్లితెరలో టి.ఆర్.పి రేటింగ్ లో కూడా రికార్డ్ సాధించాలని కోరుకుంటున్నారు.
తాజాగా శాటిలైట్ రైట్స్ అంటూ కోట్లకు కోట్లు పెట్టి సినిమా కొనేస్తున్న టివి చానెళ్లు స్టార్ హీరోల సినిమాలు సరిగ్గా పండుగ సీజన్లో టెలికాస్ట్ చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ టెంపర్ రీసెంట్ గా టెలికాస్ట్ అయ్యి 26 టి.ఆర్.పి రేటింగ్ సంపాధించింది. అయితే మొన్న దసరాకు మా టివిలో వచ్చిన బాహుబలి ఆ రికార్డుని బ్రేక్ చేయక పోవడం అందరిని ఆశ్చ్రర్యంలో ముంచెత్తింది. ప్రపంచం మొత్తం శభాష్ అని చెప్పిన రాజమౌళి ‘బాహుబలి’ సినిమా బుల్లితెరలో టెంపర్ రికార్డులను బ్రేక్ చేయక పోవడం షాకింగ్ గా ఉన్నా.. మా టివి వారు సినిమాను సాగాదీసేసరికి ఆడియెన్స్ చానెల్స్ మార్చేశారని అంటున్నారు.
అయితే ఎన్.టి.ఆర్ టెంపర్ తో క్రియేట్ చేసిన టి.ఆర్.పి రికార్డును సూపర్ స్టార్ మహేష్ తన శ్రీమంతుడు సినిమాతో కొట్టడానికి సిద్ధమయ్యారు. ఈ నెల 8న జీ తెలుగులో టెలికాస్ట్ అవ్వబోతున్న శ్రీమంతుడు సినిమా మీద బుల్లితెర ప్రేక్షకులు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మహేష్ సినిమా టెంపర్ సినిమాను బీట్ చేస్తుందని అనుకుంటున్నారంతా.. శ్రీమంతుడు అయినా టెంపర్ రికార్డులను బ్రేక్ చేస్తాడో లేదో ఆరోజు తెలిపోద్ది.