సైజ్ జీరో ఆడియో రిలీజ్ నాడు అనుష్క టైస్ గురించి అసభ్యకరంగా మాట్లాడాడని ఆలి పై అన్ని వర్గాల నుండి నిరసనలు వస్తున్న సంగతి తెలిసిందే. మహిళా సంఘాలు కూడా ఆలిపై ఫైట్ కు సిద్ధమయ్యారు. అయితే మ్యాటర్ ఇంకా రచ్చ రచ్చ అయ్యేలా ఉందని నిన్న ఓ ప్రముఖ న్యూస్ చానెల్ కి వచ్చి ఆలి తన వివరణ ఇచ్చుకున్నాడు. కొద్దిరోజులుగా తన మీద వస్తున్నటువంటి రూమర్స్ కి చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు ఆలి. కేవలం కామెడీ కోసమే తను అలా మాట్లాడతానని మనసులో ఎలాంటి ఉద్దేశం లేదని అన్నాడు.
తన గురించి కావాలనే తప్పుడు రాతలు రాస్తున్నారని.. ఇక నుండి అలా రాసే వారి అంతు చూస్తానని అన్నారు. అంతేకాదు ఇక మీదట ఆడియో ఫంక్షన్స్ కి రానని, వచ్చినా తానేం మాట్లాడనని అన్నాడు ఆలి. పరిశ్రమలో తనకు పెద్ద పెద్ద వాళ్లతో మంచి సాన్నిహిత్యం ఉందని.. రాజమౌళి, పవన్ కళ్యాణ్ లాంటి వారు తనని రేయ్ అనేంత చనువు ఉందని అన్నాడు ఆలి.
మరి ఆలి ఇచ్చిన ఈ వివరణకు శాంతిస్తారో లేక మళ్లీ దీనిలో కూడా ఏదైనా తప్పు వెతికి మళ్లీ రచ్చ చేస్తారో చూడాలి. మొత్తానికి ఆలి నోటి దురుసు తనానికి తానే స్వయంగా వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి విషయం ఇక్కడితో ఆగుతుందో లేదో చూడాలి.