పూరి జగన్నాథ్ డైరక్షన్లో వరుణ్ తేజ్ మూడో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ముందునుండి ఈ సినిమా టైటిల్ విషయంలో కాస్త కన్ ఫ్యూజన్ ఏర్పడేలా చేశాడు పూరి. మొదట లోఫర్ టైటిల్ అని పెట్టిన డైరక్టర్ పూరి జగన్నాథ్ ఆ టైటిల్ పట్ల ఫ్యాన్స్ నుండి ఇంకా పలువురు సిని ప్రముఖుల నుండి విమర్శలు రావడంతో దాన్ని మా అమ్మ సీతామాలక్ష్మి అని మార్చుతున్నాడని అన్నారు. కాని నిన్న సడెన్ గా వరుణ్ తేజ్ తో తీసే సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి అందరిని షాక్ ఇచ్చాడు పూరి.
ఆ ఫస్ట్ లుక్ తో టైటిల్ కూడా లోఫర్ అని డిక్లేర్ అయ్యింది. ముకుంద, కంచె సినిమాల తర్వాత వరుణ్ తేజ్ నుండి వస్తున్న ఫుల్ లెంథ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ లోఫర్ సినిమా. సినిమాలో సీనియర్ నటి రేవతి స్క్రీన్ చేసుకోవడం విశేషం. సినిమా మదర్ సెంటిమెంట్ తో ఉండటం వలన సినిమాకు లోఫర్ కన్నా మా అమ్మ సీతామాలక్ష్మి అని పెడదామనుకున్నా పూరి మార్క్ టైటిల్ అంటే లోఫరే కాబట్టి దాన్నే ఫైనల్ చేశాడు.
మహేష్ ని పోకిరిలా, అల్లు అర్జున్ ని దేశముదురులా, రవితేజ ని ఇడియట్ లా చూపించిన పూరి వరుణ్ తేజ్ ని లోఫర్ గా చూపించి సూపర్ హిట్ కొట్టబోతున్నాడు. రీసెంట్ కంచె సినిమా హిట్ జోష్ లో ఉన్న వరుణ్ ఈ సినిమాతో మాస్ ఆడియెన్స్ కి కూడా దగ్గరవుతాడనడంలో సందేహం లేదు. అన్ని హంగులు ముగించుకుని ఈ సినిమా డిసెంబర్ 18న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.