కోలీవుడ్ యాక్షన్ స్టార్ అజిత్ లేటెస్ట్ సినిమా ‘వేదలం’ ఇదే సినిమాను తెలుగులో ‘ఆవేశం’గా రిలీజ్ చేస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతున్న ఈ సినిమా రిలీజ్ కు ముందే ఆన్ లైన్లో దర్శనమిచ్చి అందరికి షాక్ ఇచ్చింది. తమ సినిమా ఆన్ లైన్లో లీక్ అయ్యిందని తెలుసుకుని ఉలిక్కి పడ్డ చిత్ర యూనిట్ లీక్ ఎలా అయ్యిందనే కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు. ముందు ఈ సినిమా లీక్ అయిన వెబ్ సైట్స్ బ్లాక్ చేయించి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.
రంగంలోకి దిగిన పోలీసులు సినిమా ఎలా లీక్ అయ్యిందన్న దాని మీద విచారించడం మొదలెట్టారు. అజిత్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తుంది. ఈ దీపావళికి తల ఫ్యాన్స్ కి గిఫ్ట్ గా వస్తున్న వేదలం మీద లీక్ షాక్ తగలడం చిత్ర యూనిట్ నోట మాట రాకుండా చేసింది. ఇంతకుముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా కూడా ఇలానే లీక్ బాట పట్టడం జరిగింది. సినిమా మొదటి భాగం మొత్తం లీక్ అయ్యేసరికి యుద్ధ ప్రాతిపదికన సినిమాను అప్పుడు రిలీజ్ చేశారు.
అయితే అజిత్ సినిమా కూడా ఇంకో రెండు రోజుల్లో రిలీజ్ ఉండగా ఇప్పుడు సినిమా మొత్తం లీక్ అవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సినిమా లీక్ కూడా మంచి ప్రింట్ కావడం చేత ఈ ప్రభావం సినిమా ఓపెనింగ్ కలక్షన్స్ మీద ఏమన్నా పడుతుందేమో అని ఖంగారు పడుతున్నారు చిత్ర యూనిట్.