ఈ మధ్య చిన్న సినిమాలు భారీ విజయం నమోదు చేసుకోవడం జరుగుతుంది. భారీ బడ్జెట్ సినిమాలకు పోటీగా చిన్న బడ్జెట్ సినిమాలు కూడా అదే తరహాలో కలక్షన్స్ సాధిస్తూ నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెడుతున్నాయి. స్టార్ హీరోల సినిమాలు ఓ రేంజ్ హిట్ అయితేనే తప్ప కలక్షన్స్ అంతగా రావు. కాని చిన్న సినిమాలు బాగుంది అని అనిపించుకుంటే చాలు సినిమా బడ్జెట్ కి మూడింతలు వసూలు చేసి అదరగొడుతున్నాయి.
అందుకే స్టార్ ప్రొడ్యూసర్స్ సైతం చిన్న సినిమాలకు సెపరేట్ ప్రొడక్షన్ హౌజ్ ని కూడా క్రియేట్ చేస్తున్నాయి. సినిమా రిలీజ్ కు ముందే సినిమా మంచి లాభాలతో సెల్ అవుతూ సేఫ్ బిజినెస్ జరుగుతుం ది.అల్లు అరవింద్ లాంటి ప్రొడ్యూసర్ కే చిన్న సినిమాల మీద ప్రేమ పెరిగిందంటే ఇక చిన్న సినిమాలకు కూడా మంచి రోజులొచ్చినట్టే. కుర్ర హీరో కొత్త దర్శకుడు కాని పెద్ద బ్యానర్లో సినిమా.. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఇదే.. స్టార్ హీరోల సినిమాలు తీసే ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న ఆ బ్యానర్లు చిన్న సినిమాలు తీయడం వలన చిన్న హీరోలు కూడా స్టార్ స్టేటస్ కి ఎగబ్రాకుతున్నారు.
బ్యానర్ కి ఉన్న వాల్యూని కమర్షియల్ పంథాలో ఆలోచించి.. తీసేవి చిన్న సినిమాలే అయినా పెద్ద విజయాలను అందుకుంటూ మంచి లాభాలను పొందుతున్నారు. రీసెంట్ భలే భలే మగాడివోయ్ సినిమా భారీ విజయం దీనికి మంచి ఉదాహరణగా నిలిచింది. ఇక అదే బాటలో నడవడానికి అదే రేంజ్ హిట్ కొట్టడానికి సినిమాలన్నీ క్యూలు కడుతున్నాయి. నయా ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన బడా ప్రొడ్యూసర్లు వీటిని ఎంతకాలం కొనసాగిస్తారో చూడాలి.