మాస్ మహరాజ్ రవితేజ కిక్-2 ఫ్లాప్ ని జీర్ణీంచుకోలేక పోతున్నాడు రాబోతున్న బెంగాల్ టైగర్ తో కచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అందుకే సినిమా అవుట్ పుట్ బాగా వచ్చేలా చాలా జాగ్రత్త పడుతున్నాడట. ఇక డైరక్టర్ సంపత్ నంది కూడా ఈ సినిమా చాలా ప్రెస్టిజియస్ గా తీసుకున్నాడు సర్ధార్ గబ్బర్ సింగ్ దర్శకుడిగా అనుకుని మళ్లీ తొలగించి అవమానించ బడ్డ సంపత్.. రవితేజ బెంగాల్ టైగర్ తో తన పవర్ ని చూపించనున్నాడు. ఇక వదిలిన ట్రైలర్ తో సినిమా అంచనాలను పెంచేలా చేసింది.
కిక్-2 ఫ్లాప్ తో రవితేజ పని అయిపోయిందనుకున్నారంతా.. కాని బెంగాల్ టైగర్ పంజా చూశాకా సినిమా హిట్టు కొట్టేట్టే ఉన్నాడని అనుకుంటున్నారు. మాస్ మహారాజ్ మరోసారి మరో ఫుల్ లెంత్ మాస్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా భారీ రేటుకి ప్రముఖ చానెల్ అందుకున్నదని టాక్. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ 7 కోట్లకు కొన్నారట ఎంటర్ టైన్మెంట్ చానెల్ వారు. రవితేజ కెరియర్లో ఏ సినిమా ఇంత భారీ రేటుకు శాటిలైట్ అమ్ముడవ్వలేదు.. వరుస సినిమాలు ఫ్లాప్ అవుతున్నా శాటిలైట్ మాత్రం బాగానే పలికింది రవితేజ బెంగాల్ టైగర్.
శాటిలైట్ రైట్స్ లానే సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుని మాస్ మహరాజ్ కి మంచి జోష్ హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు రవితేజ ఫ్యాన్స్. తమన్నా, రాశి ఖన్నాల అందాలు హైలెట్ అవుతున్న ఈ సినిమా రాదా మోహన్ నిర్మిస్తున్నారు. ఈ నెల 27న రిలీజ్ అవుతున్న బెంగాల్ టైగర్ ఏ రేంజ్ హిట్ అవుతుందో తెలుసుకోవాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.