క్రియేటివ్ సినిమాలను తీస్తూ దర్శకుడిగా తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు డైరక్టర్ సుకుమార్. ఆర్య నుండి 1-నేనొక్కడినే వరకు తన సినిమాలను చూస్తే కథ కథనాల్లో మిగతా దర్శకుల కన్నా చాలా సుకుమార్ డిఫరెంట్ అని మనకు అర్ధమవుతుంది. దర్శకుడిగా ఉన్న సుక్కు సడెన్ గా నిర్మాతగా మారి కుమారి 21ఎఫ్ సినిమా తీశాడు. రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న ఈ సినిమా మొదటి నుండి టాక్ ఆఫ్ ది టౌన్ అవుతూ వచ్చింది.
సినిమా చిన్నదే అయినా సుకుమార్ క్రియేషన్స్ అనగానే కుమారిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వదిలిన టీజర్లు, ట్రైలర్లు సినిమాలో కొంచం మసాలా వాసన ఉన్నట్టు అనిపించింది. అయితే అనుకున్నట్టుగానే సినిమాలో హాట్ సీన్లు..లిప్ లాకులు బాగా ఉన్నాయట. రీసెంట్ గా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న కుమారి ఊహించని విధంగా ఏ సర్టిఫికెట్ ఇచ్చి షాక్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు. సుకుమార్ మొదటి సారి నిర్మాతగా మారి అడల్ట్ కంటెంట్ సినిమా తీయడమేంటని అందరు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
సినిమాలో కుమారి బాగా రెచ్చిపోయిందట.. కేవలం యూత్ ఆడియెన్స్ ని దృష్టిలో ఉంచుకునే కుమారి కథ రాసుకున్నాడని అంటున్నారు. సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా రత్నవేలు కెమెరా మెన్ గా పనిచేశారు. ఈ నెల 20న రిలీజ్ అవుతున్న కుమారి 21ఎఫ్ సినిమా సుకుమార్ కి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. సినిమాను చాలా ఏరియాల్లో దిల్ రాజు విడుదల చేస్తున్నాడన్నది తెలిసిన వార్త.