వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో నేటి నుంచి వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొనబోతున్నారు. తన పార్టీ అభ్యర్ధి నల్లా సూర్య ప్రకాష్ కి మద్దతుగా నేటి నుంచి నాలుగు రోజులు వరుసగా వరంగల్ లోక్ సభ నియోజక వర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలలో ప్రచారం చేస్తారు.
కొద్ది సేపటి క్రితమే ఆయన హైదరాబాద్ లోని తన లోటస్ పాండ్ నివాసం నుంచి పాలకుర్తికి బయలుదేరారు. మొదట తొర్రూరులో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఆ తరువాత వరుసగా పరకాల, హన్మకొండ, వరంగల్, స్టేషన్ ఘన్ పూర్ లలో రోడ్ షోలు నిర్వహిస్తారు.
రేపు పరకాల నియోజక వర్గంలోని ఆత్మకూరులో మొదలుపెట్టి అక్కడి నుండి వరుసగా శాయంపేట, రేగొండ, భూపాలపల్లి, రోడ్డు షోలు నిర్వహించి పరాకాలలో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఆ మర్నాడు అంటే 18న పరకాల నియోజక వర్గంలో సంగెం, గీసుగొండ మండలాలో ప్రచారం చేసి గ్రేటర్ వరంగల్ పరిధిలో బహిరంగ సభలో పాల్గొంటారు. నవంబర్ 19న హన్మకొండ, కాజీపేట, ధర్మాసాగర్ లలో రోడ్ షోలలో పాల్గొని స్టేషన్ ఘన్ పూర్ లలో బహిరంగ సభ నిర్వహిస్తారు.ఆ తరువాత రఘునాధపల్లి మీదుగా తిరిగి హైదరాబాద్ చేరుకొంటారు.