కొద్దిరోజులుగా ముద్దుగుమ్మ నిత్యా మీనన్, ఈగ విలన్ సుదీప్ ఇద్దరు ప్రేమ పక్షులయ్యారని వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కన్నడలో స్టార్ హీరోగా ఉన్న సుదీప్ ప్రస్తుతం నిత్యా మీనన్ తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఆ సినిమా టైంలోనే వీరిద్దరి మనసులు దగ్గరయ్యాయని.. వీరిరువురు ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడిందని ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. సుదీప్ కూడా మొన్నీమధ్యే తన భార్యకు విడాకులివ్వడం ఈ వార్తలకు బలం చేకుర్చాయి. అయితే విషయం ఇలానే వదిలేస్తే చాలా దూరం వెళ్లేట్టు ఉందని నిత్య మీనన్ స్పందించి వివరణ ఇచ్చుకుంది.
కన్నడ-తమిళ్ బైలింగ్వల్ గా వస్తున్న సినిమా ‘ముదింజ ఇవన్ పుడి’ ఈ సినిమాలో సుదీప్, నిత్యా మీనన్ జంటగా నటిస్తున్నారు. ఈ షూటింగ్ టైంలో ఆన్ స్క్రీనే కాకుండా ఇద్దరు ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ కూడా చేస్తున్నారని మీడియా హడావిడి చేస్తుంది. అయితే ఈ వార్తలు విని షాక్ ఐన నిత్య ఇంకా తను ప్రేమించే వాడు తారస పడలేదని.. సుదీప్ కి తనకు మధ్య ఎలాంటి రిలేషన్ లేదని తేల్చి చెప్పేసింది.
అయితే నిత్యా, సుదీప్ ని పెళ్లి చేసుకుంటుంది అని వచ్చిన వాదనలకు ఎట్టకేలకు చెక్ పెట్టేసింది అమ్మడు. ప్రస్తుతం కోలీవుడ్లో ఫుల్ ఫాంలో ఉన్న నిత్య మీనన్ ప్రస్తుతం తెలుగులో సందీప్ కిషన్ హీరోగా చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా ఓకే అయ్యింది..