తెలుగమ్మాయి స్వాతి గుర్తుంది కదా అదేంటి ప్రస్తుతం త్రిపురగా సందడి చేస్తుంది కదా ఎలా మర్చిపోతాం అని అనుకుంటున్నారు కదా.. గీతాంజలి దర్శకుడు రాజ్ కిరణ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాగా ఆడుతుందని అనుకున్నారు దర్శక నిర్మాతలు. అయితే సినిమా రెగ్యులర్ కామెడీ కం హర్రర్ మూవీలానే ఉండటంతో ఆడియెన్స్ పెదవి విరిచేశారు. మంచి ఫాంలో ఉన్న అమ్మడికి ఈ సినిమా కాస్త నిరాశ పరచిందనే అనాలి. ఇకపోతే సినిమా హిట్టైనా సరే దాదాపు సంవత్సరం దాకా అమ్మడు వేరే సినిమా చేసేది కాదు. అంటే ఆఫర్లే ఒకటి రెండు వచ్చేవి వాటిలో అమ్మడికి నచ్చింది వచ్చేసరికి వన్ ఇయర్ గడిచిపోయేది.
అయితే ఇప్పుడు సినిమా ఫ్లాప్ అయినా సరే స్వాతికి ఆఫర్లు వెళ్లువల్లా వచ్చి పడుతున్నాయట. త్రిపుర తర్వాత ఏ సినిమా కమిట్ అవ్వని స్వాతి బెల్లంకొండ హీరో శ్రీను మనసు గెలుచుకున్నదని అంటున్నారు. స్టార్ నిర్మాత అనేది అవునో కాదో కాని స్టార్ డిస్ట్రిబ్యూటర్ అయిన బెల్లంకొండ సురేష్ తన కొడుకు రెండో సినిమాకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
హిట్ గ్యారెంటి అనే కథతోనే వస్తున్నాడు సురేష్. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీను భీమనేని శ్రీనివాస్ డైరక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. తెలుస్తున్న కథనాల ప్రకారం ఆ సినిమాలో హీరోయిన్ గా స్వాతి ఒకే అయ్యిందట. బెల్లంకొండ సినిమాలో హీరోయిన్ చాన్స్ అంటే చాలా గొప్ప విషయమే.. అయితే సినిమాలో స్వాతి ఒక్కతే హీరోయిన్ గా ఉంటుందా ఇంకెవరైనా హీరోయిన్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటుందా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం త్రిపుర కాస్త నిరాశ పరచేలా చేసినా ఈ ఆఫర్ తో అమ్మడిని సంతోష పెట్టేలా చేసింది. మరి రాక రాక వచ్చిన ఈ స్టార్ ఆఫర్ ని స్వాతి ఎలా వాడుకుంటుందో చూడాలి.