ఏంటి అచ్చు తప్పు పడ్డదేమో అని అనుకుంటున్నారు కావొచ్చు.. నమ్రత ఉండాల్సిన ప్లేస్లో శృతి ఉందని కంగారు పడొచ్చు.. నిజజీవితంలో ఎలాగు మహేష్, నమ్రతలు బెస్ట్ కపులే లేండి. మనం ఇక్కడ మాట్లాడేది ఈ ఇయర్ రిలీజ్ అయిన సినిమాల్లో బెస్ట్ కపుల్స్ గురించి.. తాజాగా ఓ ప్రముఖ సంస్థ నిర్వహించిన ఈ ఇయర్ బెస్ట్ కపుల్స్ హీరో హీరోయిన్స్ లో అందరు పోటీలోకి రాగా.. ఎన్.టి.ఆర్ – కాజల్ (టెంపర్), ప్రభాస్ – తమన్నా (బాహుబలి), మహేష్ – శృతిహాసన్ (శ్రీమంతుడు) పోటీల్లో టాప్ మోస్ట్ గా నిలిచాయి.
అయితే ఈ మూడు జంటల్లో కూడా మహేష్ శృతి హాసన్ జంటకే ఎక్కువ ఓట్స్ రాగా ఈ జంట ఈ ఇయర్ బెస్ట్ కపుల్స్ గా నిర్ణయించారు. ఈ సంవత్సరం మొదట సగం ఒక్క పటాస్, టెంపర్ హిట్స్ తోనే సరిపెట్టుకున్న టాలీవుడ్ రెండో భాగంలో బాహుబలి, శ్రీమంతుడు, భలే భలే మగాడివోయ్ లాంటి సూపర్ హిట్ సినిమాలతో సూపర్ హిట్ కలక్షన్స్ సాధించాయి.
ఎన్.టి.ఆర్- కాజల్, ప్రభాస్- తమన్నాలు బెస్ట్ కపుల్సే అయినా ఇదవరకు వీరి జంటలు వేరు వేరు సినిమాల్లో కనిపించి అలరించాయి. కాని మహేష్ శృతి జంట శ్రీమంతుడు సినిమాతోనే మొదటిసారి జోడీ కట్టారు. చూడముచ్చటైన ఈ జంట బెస్ట్ కపుల్స్ గా కూడా హిట్ కొట్టారు. మరి మళ్లీ ఈ జతకలిసి ఏ సినిమా చేస్తారో చూడాలి.