లీడర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది హాట్ గాళ్ రిచా గంగోపాధ్యాయ.. మోడలింగ్ రంగంలో ఉంటూనే సినిమాలపై ఆసక్తి చూపించడంతో శేఖర్ కమ్ముల రానాకి జోడీగా లీడర్ సినిమాలో నటించే చాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా హిట్ అవ్వడంతో అమ్మడికి వరుస ఆఫర్లు వచ్చి పడ్డాయి. మిరపకాయ్, నాగవల్లి, సారొచ్చారు, మిర్చి సినిమాల్లో నటించి మెప్పించిన రిచా ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందట.
అందాల ముద్దుగుమ్మగా తన అభినయంతో పాటుగా అందంతో ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేసి ఈ సుందరి ఇంత తొందరగా సినిమాలకు బై చెప్పడం కాస్త బాధగా ఉన్నా పై చదువుల నిమ్మిత్తం అమ్మడు ఇక సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకుందట. అయితే ఇది శాస్వితంగానా లేక స్టడీస్ కంప్లీట్ అయ్యే వరకా అన్నది తెలియదు కాని.. స్టడీస్ కోసం సినిమాలను ఆపేస్తున్నా.. అంటూ అమ్మడు ట్విట్టర్లో మెసేజ్ పోస్ట్ చేసింది.
తెలుగులో ఆరు సినిమాల్లో నటించిన రిచా తమిళ్ లో రెండు సినిమాలు, ఒక బెంగాలి సినిమాలో నటించింది. అమ్మడు ఇంత సడెన్ గా కెరియర్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తుందని ఎవరు ఊహించి ఉండరు. రోజుకో అప్సరస లాంటి హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంటే కేవలం అభినయం మాత్రమే చేస్తా అన్న హీరోయిన్ల పరిస్థితి ఇలా మధ్యలో ఆగిపోవాల్సిందే అనుకుంటా.. మరి స్టడీస్ కంప్లీట్ అయ్యాక మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి షాక్ ఇస్తుందో లేక ఇక ఇంతటితోనే సరిపెట్టుకుంటుందో చూడాలి.