మెగా బ్రదర్ నాగబాబు తనయురాలు నిహారిక టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది అన్న క్షణం నుండి ఓ క్రేజ్ ని సంతరించుకుంది. మెగా ఫ్యామిలీ నుండి ఇన్నాళ్లు హీరోలే వచ్చారు అయితే ఆ మేనియాను ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తను కూడా కంటిన్యూ చేసేందుకు సిద్ధమైంది నిహారిక కొణిదెల. నిహారిక సినిమా చేస్తుందని అని తెలిసిన టైం నుండి ఆమె సినిమా చేయడం మెగా ఫ్యామిలీకి ఇష్టం లేదని చాటింపేశారు. అయితే సినిమాలో నటించడం నటించక పోవడం అది ఎవరి ఇష్టం వారిదే అయినా మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న అమ్మాయి కాబట్టి నిహారిక మీద అందరి గురి.
అయితే ఫ్యామిలీకి ఇష్టమా కాదా అన్నది ఆమె చేస్తున్న సినిమా ముహుర్తం నాడు తేలుతుందని అభిప్రాయపడ్డారు. అనుకున్నట్టుగానే నిహారిక ముహుర్తానికి తన కుటుంబ సభ్యులు తప్ప ఇంకెవరు హాజరు కాలేదు. అయితే దీనికి కారణాలు ఏమైనా నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం మెగా ఫ్యామిలీకి ఇష్టం లేకపోవడమే అని మీడియా రచ్చ చేయడం మొదలెట్టింది. మెగాస్టార్ అంతటి వాడు రాకపోయినా నిన్న మొన్న ఎంట్రీ ఇచ్చిన మెగా హీరోలు కూడా ఈ ముహుర్తానికి అటెండ్ అవ్వక డౌట్ కలిగేలా చేస్తున్నాయి.
టివి-9, మధురా శ్రీధర్ కలిసి నిర్మిస్తున్న ‘ఒక మనసు’ సినిమాలో నాగ శౌర్య హీరోగా.. నిహారిక హీరోయిన్ గా చేస్తున్నారు. మొన్నటిదాకా బుల్లితెరలో తన క్యూట్ మాటలతో ప్రేక్షకులను అలరించిన ఈ చిన్నది ఇప్పుడు వెండితెర మీద కూడా అలరించనుంది. మరి హీరోలుగా ఎంట్రీ ఇచ్చి మెగా మేనియాను కంటిన్యూ చేస్తున్నట్టుగా హీరోయిన్ గా కూడా నిహారిక భారీ రేంజ్ కి వెళ్లాలని కోరుకుందాం.