కుర్ర హీరోల్లో శర్వానంద్ అంటే ఆడియెన్స్ లో సెపరేట్ క్రేజ్.. తను సెలక్ట్ చేసుకునే సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ యువ హీరో సినిమా సినిమాకు చేసే కథల్లో కూడా చాలా కొత్తదనం ఉండేలా చూసుకుంటాడు. రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాల హిట్ జోష్లో ఉన్న శర్వానంద్ ప్రస్తుతం ‘ఎక్స్ ప్రెస్ రాజా’ సినిమాతో సంక్రాంతికి సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత శర్వా మళ్లీ తనకు మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి డీసెంట్ హిట్ ఇచ్చిన క్రాంతి మాధవ్ తోనే చేస్తాడని అంటున్నారు.
ఓనమాలు సినిమాతో దర్శకుడిగా మారిన క్రాంతి మాధవ్ సెకండ్ సినిమా కోసం గ్యాప్ తీసుకుని శర్వానంద్ తో మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమా తెరకెక్కించాడు. అయితే ఆ సినిమా తర్వాత విక్టరీ వెంకటేష్ కోసం ఓ కథ అనుకున్నా అది సెట్ అవ్వక మళ్లీ శర్వానంద్ తోనే మరో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడట. వెంకటేష్ కోసం రాసుకున్న కథ శర్వానంద్ తో చేస్తున్నాడా ఏంటి అనే కన్ ఫ్యూజన్ వస్తుందని.. వెంకీ కథ కాకుండా ఈ యువ హీరో కోసం మరో కథ సిద్ధం చేశాడట క్రాంతి మాధవ్.
దర్శకుడు, హీరో ఓకే అయిన ఈ సినిమా మిగతా స్టార్ కాస్ట్ అండ్ క్రూ మొత్తం త్వరలో తెలియనుంది. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమా సక్సెస్ అయినా సరే కమర్షియల్ గా పెద్దగా లాభాలు తీసుకురాలేదు అయితే రాబోయే ఈ సినిమా కమర్షియల్ గా కూడా కొట్టాలనే ప్లాన్ చేస్తున్నారు వీరిద్దరు. మరి ఇద్దరు ప్లాన్ ఏ విధంగా వర్క్ అవుతుందో సినిమా వస్తేనేగాని చెప్పలేం.