హైదరాబాద్: సరిగ్గా వారంక్రితం ప్యారిస్ నగరంలో జరిగిన తీవ్రవాద దాడి మరవకముందే తీవ్రవాదులు ఇవాళ మరోచోట దాడికి తెగబడ్డారు. పశ్చిమ ఆఫ్రికా దేశం మాలి రాజధాని బమాకోలో రాడిసన్ హోటల్‌పై ఉగ్రవాదులు దాడిచేసి 140మంది గెస్ట్‌లను, 30మంది సిబ్బందిని బందీలుగా తీసుకున్నారు. ఇద్దరే గన్ మ్యాన్లు ఈ దాడి చేసినట్లు చెబుతున్నారు. వారు అరబిక్ భాషలో అల్లా హో అక్బర్, గాడ్ ఈజ్ గ్రేట్ అంటూ అరుస్తూ హోటల్ ఆవరణలోకి ప్రవేశించారని అంటున్నారు. బందీలలో – ఖురాన్‌లోని శ్లోకాలను చెప్పినవారిని తీవ్రవాదులు వదిలేశారని సమాచారం. ఈ హోటల్లో ఎక్కువమంది ఇక్కడకు పనిచేయటానికి వచ్చిన విదేశీయులు ఉన్నారు. మరోవైపు మాలి దేశ సైనికులు, పోలీసులు, స్పెషల్ ఫోర్స్ దళాలు, ఐక్యరాజ్యసమితి పీస్ కీపింగ్ ఫోర్స్ దళాలు, ఫ్రాన్స్ సైనికులు హోటల్‌ను చుట్టుముట్టారు. మాలిలో గతంలో 2013లో కూడా ఇస్లామిక్ తీవ్రవాదలు ఒక హోటల్‌పై దాడి చేసి 13 మంది ఐక్యరాజ్యసమితి సిబ్బందిని కాల్చిచంపారు.