నటీనటులు : కమల్ హాసన్, త్రిష, ప్రకాశ్ రాజ్, మధు శాలిని, సంపత్, కిశోర్
సంగీతం : గిబ్రాన్
దర్శకత్వం: రాజేష్ ఎం.సెల్వం
నిర్మాతలు : ఎస్. చంద్ర హాసన్, కమల్ హాసన్
లోకనాయకుడు కమల్ హాసన్ సినిమా పరిశ్రమకు దొరికిన ఓ అద్భుత నటుడు. ఆయన చేసిన ఎన్నో పాత్రలు సిని ప్రియులను అలరించాయి. అలాంటి నట దిగ్గజం ఓ సింపుల్ థ్రిల్లింగ్ సబ్జెక్ట్ తో మనముందుకు వచ్చాడు. ‘చీకటి రాజ్యం’ టైటిల్ తో ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా కోలీవుడ్లో ‘తూంగావనం’గా దీపావళికి రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. మరి తెలుగు వర్షన్ ఏ విధంగా ఆకట్టుకుందో మన సమీక్షలో చూద్దాం.
కథ:
దివాకర్ (కమల్ హాసన్) నార్కాటిక్ కంట్రోల్ బ్యూరో ఆఫిసర్.. అండర్ కవర్ ఆపరేషన్స్ చేస్తూ మత్తు పదార్ధాలను రన్ చేస్తున్న కంపెనీలను సీజ్ చేస్తాడు. ఆ దారిలోనే విఠల్ రావ్ (ప్రకాశ్ రాజ్) నడిపిస్తున్న డ్రగ్స్ కంపెనీని కూడా పెద్ద మొత్తంలో సీజ్ చేస్తాడు. అయితే సీజ్ చేసిన డ్రగ్స్ ని పోలీసులకు హ్యాండ్ అవర్ చేయకుండా తన దగ్గరే ఉంచుకుని విఠల్ తో గేం ఆడుతుంటాడు దివాకర్. విఠల్ తన ముందు చూపుతో దివాకర్ కొడుకుని కిడ్నాప్ చేయిస్తాడు. దివాకర్ టీంలోనే ఉన్న మల్లిక (త్రిష), దైరావియం (కిశోర్) సడెన్ గా దివాకర్ కు ఎదురుతిరుగుతారు. అసలు దివాకర్ ఆ డ్రగ్స్ ని ఎందుకు దాచాడు..? దివార్ కు మల్లిక, కిశోర్ లు ఎందుకు తిరుగుతారు..? చివరకు విఠల్ దగ్గర నుండి దివాకర్ తన కొడుకుని ఎలా కాపాడుకున్నాడు..? అన్నదే అసలు కథ.
టెక్నికల్ డిపార్ట్మెంట్ :
తన సినిమాలో ప్రతిది పర్ఫెక్ట్ గా ఉండాలని చూసే కమల్ హాసన్ ముఖ్యంగా టెక్నికల్ గా సినిమా చాలా బాగా వచ్చేలా చేశారు. అలాగే చీకటి రాజ్యంలో కూడా టెక్నికల్ గా ఫిట్ అనిపించాడు. జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ సినిమాను చాలా రిచ్ గా చూపించింది. లొకేషన్స్ తక్కువే అయినా చాలా నీట్ గా విజువలైజ్ చేశారు. ఇక సినిమాకు గిబ్రాన్ ఇచ్చిన సంగీతం కూడా సింప్లీ సూపర్బ్ అని చెప్పొచ్చు. కమల్ తో మంచి ట్యూన్ అప్ అయిన గిబ్రాన్ చాలా కేర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చి సినిమా ఫీల్ ని కంటిన్యూ చేసేలా సహకరించాడు. షాన్ మహమ్మద్ ఎడిటింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సినిమా స్క్రీన్ ప్లే కమల్ సొంతంగా చూడడం విశేషం. అబ్బూరి రవి మాటలు కూడా ఆకట్టుకున్నాయి.
విశ్లేషణ:
కమల్ సినిమా అనగానే భారీ సెట్టింగులు.. మరెన్నో రకాల ఎమోషన్స్ ఉంటాయి కాని ఈ సినిమాలో కేవలం ఒక్కరోజు జరిగే సంఘటన ఆధారంగా తెరకెక్కించి ఆడియెన్స్ ని మంచి థ్రిల్లింగ్ ని కలిగించారు కమల్ హాసన్. సినిమాలో మధుశాలిని లిప్ లాక్, త్రిషా నటన ప్లస్ అయ్యేలా ఉన్నా.. మరోసారి తన అద్భుత నటనతో కమల్ అదరగొట్టాడని చెప్పొచ్చు. విలన్ అంటే ఓ భయంకరంగా ఉండాల్సిన అవసరం లేదు సింపుల్ గా ఓ పబ్ లో కూడా ఉంటాడని కొత్తగా చూపించాడు దర్శకుడు. ప్రకాశ్ రాజ్ కూడా విలనిజంలో కొత్త కోణాన్ని చూపించాడు. సినిమా మొత్తం బాగున్నా కేవలం ఏ క్లాస్ ఆడియెన్స్ కి ఎక్కే సినిమాల అనిపిస్తుంది. మొదటి భాగం పర్వాలేదనిపించినా సెకండ్ ఆఫ్లో సినిమా చాలా స్లోగా అనిపిస్తుంది. సినిమా గ్రిప్ అక్కడక్కడ తగ్గుతూ పెరుగుతూ వస్తుంది. సినిమాలో కమల్ మరోసారి తన నట ప్రదర్శన చేయగా.. పాత్రల పరిధి మేరకు త్రిష, ప్రకాశ్ రాజ్, సంపత్ లు అలరించారు. సినిమా బి,సి సెంటర్స్ లో ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండదు. మొత్తానికైతే తక్కువ బడ్జెట్ తో కమల్ ఫ్యాక్టరీ నుండి వచ్చిన మంచి సినిమా చీకటి రాజ్యం.
ప్లస్ పయింట్స్ :
కమల్ హాసన్, త్రిష
స్క్రీన్ ప్లే
గిబ్రాన్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్ :
స్లో నేరేషన్
మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్
తీర్పు :
కమల్ సినిమా అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త విషయాన్ని ఆడియెన్స్ కి తెలియచేస్తాడు కమల్. దశావతారాలను చూపించిన కమల్ ఓ థ్రిల్లింగ్ సబ్జెక్ట్ తో రావాలనుకోవడం విశేషం. సినిమా మొత్తం తన అద్భుతమైన నటనతో అలరిస్తాడు. చిత్ర యూనిట్ చెప్పినంత థ్రిల్ లేకపోయినా సినిమా ప్రేమికులకు, కమల్ అభిమానులకు, రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చూసి బోర్ ఫీల్ అయ్యే ప్రేక్షకులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. సరదాగా వెళ్లి సినిమా చూసొద్దాం అని ఫ్రెండ్స్ తో కలిసి చీకటి రాజ్యం కి వెళ్లి రావొచ్చు.
తెలుగు360రేటింగ్ : 2.75/5