వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చిన్నది రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్లో హీరోయిన్స్ కొరత ఉంది అని అనుకుంటున్న కరెక్ట్ టైంకి అమ్మడు వచ్చేసరికి లక్ తోడై అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా అవతరించింది. చేసిన సినిమాలన్ని హిట్ బాట పట్టించిన అమ్మడు చిన్న హీరోలతో చేస్తూ చేస్తూనే స్టార్ హీరోలతో జతకట్టే క్రేజ్ సంపాధించిది. అయితే చిన్న సినిమాలకు గోల్డెన్ లెగ్ అనిపించుకున్న అమ్మడు స్టార్ హీరోల సినిమాలకు ఐరన్ లెగ్ అయ్యిందని ఇండస్ట్రీ టాక్. దానికి కారణాలు కూడా లేకపోలేదు.. అప్పటిదాకా కుర్ర హీరోలతో చేసిన రకుల్ మొదటి స్టార్ హీరో సినిమా రవితేజతో కిక్-2 లో నటించింది. రవితేజ కిక్, రకుల్ అందాలు సినిమాకు ఎంత హైప్ తీసుకువచ్చినా సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
కిక్-2 కోసం రవితేజతో లిప్ లాక్ చేసినా సరే సినిమా ప్రేక్షకులకు ఎక్కలేకపోయింది. ఇక ఆ సినిమా పోయినా చరణ్ బ్రూస్ లీతో అదరగొడుతుందనుకుంటే అది కూడా భారీ అంచనాలతో వచ్చి చడీ చప్పుడు లేకుండా పోయింది. ప్రస్తుతం అమ్మడు చేస్తున్న రెండు సినిమాలు సెట్స్ మీదున్నాయి ఒకటి ఎన్.టి.ఆర్ నాన్నకు ప్రేమతో, మరోటి అల్లు అర్జున్ సరైనోడు.. ఈ రెండు సినిమాలు కనుక డివైడ్ టాక్ తెచ్చుకుంటే అమ్మడి పని అయిపోయినట్టే. ఈ రెండు సినిమాల రిజల్ట్ చూశాకే రకుల్ ని తమ సినిమాలో పెట్టుకునేలా చూస్తున్నారట దర్శక నిర్మాతలు.
హిట్ వస్తే ఎంకరేజ్ చేయడం.. ఫ్లాప్ వస్తే అధ పాతాళానికి తొక్కడం ఇండస్ట్రీకి కొత్తేం కాదు.. మనుషులు మారుతాయేమో కాని రిజల్ట్ మాత్రం ఒకేలా ఉంటుంది. మరి రకుల్ స్టార్ హీరోయిన్ గా మరో మెట్టు ఎక్కుతుందో.. పాతాళానికి తొక్కేయబడుతుందో ఆ రెండు సినిమా రిజల్ట్ తో తెలుస్తుంది.