వరంగల్ లోక్సభ స్థానానికి జరిగిన ఉపఎన్నిక ఫలితాలు రేపు అంటే మంగళవారం వెలువడనున్నాయి. వరంగల్ లో ఎనుమాముల మార్కెట్ యార్డ్ లో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. వరంగల్ లోక్సభ నియోజక వర్గ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలలో పోలయిన ఓట్లను లెక్కించేందుకు మార్కెట్ యార్డులో ఏడు వేర్వేరు విశాలమయిన హాల్స్ ని ఏర్పాటు చేసామని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా మార్కెట్ యార్డు పరిసర ప్రాంతాలలో కర్ఫ్యూ విదించినట్లు తెలిపారు. ఈ ఉప ఎన్నికలలో అన్ని చోట్ల ఈవీఎంలనే ఉపయోగించారు కనుక ఓట్ల లెక్కింపు ప్రక్రియ చాలా వేగంగా పూర్తయి ఉదయం 10-11 గంటల లోపే ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.