సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ గురించి అందరికి తెలిసిందే. తను అందించే ఆల్బంలో ప్రేక్షకులు ఈజీగా ట్యూన్ అవుతారు. వినసొంపైనా పాటలతో పాటుగా పాట వింటే స్టెప్పులేయాలనంట్టుగా హుశారెత్తిస్తాయి దేవి పాటలు. అయితే సంగీత దర్శకుడిగా ఉన్నా ఆడియో వేడుకల్లో దేవి చేసే అల్లరి మాములుగా ఉండదు. హ్యాండ్సంగా ఉండే దేవి హీరోగా కూడా ట్రై చేయొచ్చు కదా అని అందరు అనుకుంటుంటారు.
అయితే దేవి శ్రీ ప్రసాద్ ని హీరోగా చేద్దామని క్యూలో ఉన్నారు దర్శక నిర్మాతలు. ఎమ్మెస్ రాజు దగ్గర నుండి అల్లు అరవింద్ వరకు.. జ్ఞావెల్ రాజా దగ్గర నుండి పివిపి ప్రసాద్ వరకు దేవి శ్రీ ప్రసాద్ ని హీరో చేద్దామనే ప్రయత్నిస్తున్నా దేవి మాత్రం నో అని చెప్పేస్తున్నాడట. రీసెంట్ గా కుమారి 21ఎఫ్ సినిమా సక్సెస్ కొట్టిన దేవి ఆ సినిమా సక్సెస్ మీట్ గురించి ఇచ్చిన ఇంటర్వ్యూలో 100% లవ్ సినిమా హీరోగా ముందు సుకుమార్ తననే అనుకున్నాడని చెప్పాడు.
ఈగోతో నిండే ఆ పాత్రకు తనకి నప్పదని సున్నితంగా తిరస్కరించాడట. దేవి వద్దన్న తర్వాత నాగ చైతన్యకు చెప్పి సినిమా చేశాడు సుకుమార్. చైతు కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన 100% లవ్ సినిమా దేవి చేసుకుంటే ఏ విధంగా ఉండేదో..!