సూపర్ స్టార్ మహేష్ డబ్బులు వెనక్కి ఇవ్వడమేంటని ఆశ్చర్య పడుతున్నారు కదా.. అవును నిజమే ప్రిన్స్ మహేష్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేతకు అక్షరాల 10 కోట్లను తిరిగి ఇచ్చాడట. ప్రస్తుతం బ్రహ్మోత్సవం సినిమా చేస్తున్న మహేష్ తన తర్వాత సినిమా త్రివిక్రంతో ప్లాన్ చేసేందుకు మహేష్ కు అడ్వాన్స్ రూపంలో 10 కోట్ల చెక్ ని ఇచ్చాడట నిర్మాత రాధాకృష్ణ.
అయితే మహేష్ తన తర్వాత సినిమా మురుగదాస్ డైరెక్షన్లో చేస్తుండటంతో ఇచ్చిన డబ్బుని వెనక్కి పంపించాడట మహేష్. రాధాకృష్ణ నిర్మాణ సారధ్యంలో వచ్చే ఏడాది మధ్యలో మొదలవ్వాల్సిన ఆ సినిమా పోస్ట్ పోన్ అవ్వడంతో అందాక ఇచ్చిన అడ్వాన్స్ అమౌంట్ తన దగ్గర ఉంచుకోవడం మంచిది కాదని తిరిగిచ్చేశాడట మహేష్. సినిమా తీసిన నిర్మాతల గురించే కాకుండా తీయబోయే సినిమా నిర్మాత శ్రేయస్సు గురించి కూడా ఆలోచించైన మహేష్ ని చూసి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం.
ప్రస్తుతం చేస్తున్న బ్రహ్మోత్సవం కంప్లీట్ అవ్వగానే తర్వాత మురుగదాస్ సినిమాలో న్యాయ వ్యవస్థకు సంబంధించిన కథతో మనముందుకు రాబోతున్నాడు మహేష్.