బ్రూస్ లీతో ఫ్లాప్ చవిచూసిన డైరక్టర్ శ్రీనువైట్ల పని అయిపోయింది అనుకున్నారు. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడమే కాకుండా ఇంట్లో గొడవలు కూడా బయటపడటం, కోనా ఇంకా తన మీద కోపాన్ని వెళ్లగక్కడం శ్రీనువైట్లకి తలనొప్పిగా మారాయి. ఇప్పుడిప్పుడే అన్ని సర్ధుకుంటున్నాయనుకోండి.. ఆగడు ఫ్లాప్ తర్వాత శ్రీనువైట్ల మీద నమ్మకంతో చరణ్ చాన్స్ ఇచ్చాడు కాని ఆ అవకాశాన్ని కూడా సరిగా వాడుకోలేదు శ్రీను.
మహేష్ దూకుడు తీసి పెద్ద హిట్ కొట్టిన శ్రీనువైట్ల స్టార్ డైరక్టర్ అయిపోయాడు. అయితే ఎప్పటినుండో అతనితో చేయాలని ఉన్న కుర్ర హీరోలు ఆయన్ను ఓ కంట గమనిస్తూనే ఉన్నారు. బ్రూస్ లీ ఫ్లాప్ అయ్యింది కాబట్టి ఏ స్టార్ హీరో శ్రీనుతో సినిమా చేసే ఛాన్స్ లేదు. అందుకే ప్రస్తుతం మిడిల్ రేంజ్ హీరోలతో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు ఈ దర్శకుడు. అయితే ఆ అవకాశాన్ని సరిగ్గా వాడుకోవాలని నిర్ణయించుకున్న నాగచైతన్య శ్రీనువైట్ల ఇంటికి వెళ్లి తనని కలిసి వచ్చాడట.
కలిసిన కారణాలు ఏవైనా సరే త్వరలో వీరిద్దరి కాంబోలో సినిమా మాత్రం ఖచ్చితంగా ఉంటుందని మీడియా హడావిడి చేస్తుంది. ప్రస్తుతం చైతన్య కూడా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. మరి నిజంగానే ఇద్దరు కలిసి సినిమా చేస్తారా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది.