చైల్డ్ యాక్టర్ గా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోయిన్ గా కూడా చాలా సినిమాల్లో నటించిన మీనా వెండితెర మీద తన వెలుగులు చిందించింది. తెలుగు తమిళ భాషల్లో తనదైన నటనతో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించిన మీనా పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైనా తన పాత్రకు దగ్గరగా ఉన్న సినిమాలకు అందుబాటులో ఉంటూ వస్తుంది. ‘దృశ్యం’ సినిమాలో మరోసారి విక్టరీ వెంకటేష్ తో జతకట్టిన మీనా ఇప్పుడు తన కూతురిని కూడా తనలానే చైల్డ్ ఆర్టిస్ట్ గా తెరంగేట్రం చేపిస్తుంది.
మీనా కూతురు నైనిక విజయ్ సినిమాలో నటిస్తుంది. ఇందులో విజయ్, సమంతలకు పుట్టిన పాపగా నైనిక నటించడం విశేషం. పులి ఫ్లాప్ తర్వాత ‘రాజా రాణి’ లాంటి చిన్న సినిమాతో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న అట్లీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసి మీదున్నాడు విజయ్.
సినిమాలో మూడు విభిన్న పాత్రల్లో నటించే విజయ్.. ఒక క్యారక్టర్ సమంతని పెళ్లి చేసుకుని ఉంటాడు. ఆ పాత్రకు ఒక పాప అవసరం ఉండగా మీనా కూతురిని అడుగగా ఓకే చెప్పిందట. తనలానే కూతురిని కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిందంటే మీనా నైనికాను హీరోయిన్ గా కూడా చేసేస్తుందో ఏమో చూడాలి.