హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో మేనేజర్‌పై చేయిచేసుకున్నారు. మిథున్ రెడ్డి ఈ మధ్యాహ్నం ఎయిర్‌పోర్ట్‌కు వచ్చినపుడు నూతన టెర్మినల్ వద్ద బోర్డింగ్ పాస్ విషయంలో ఆయనకు, విమానాశ్రయ సిబ్బందికి మధ్య గొడవ రేగిందని, ఈ సందర్భంగా అక్కడకు వచ్చి సర్దిచెప్పబోయిన మేనేజర్‌పై మిథున్ రెడ్డి, స్థానిక నాయకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి చేయిచేసుకున్నారని సమాచారం. సమయం దాటివచ్చిన వైసీపీ నేతలకు బోర్డింగ్ పాసులు ఇవ్వటానికి సిబ్బంది నిరాకరించటంతో గొడవ మొదలైనట్లు తెలిసింది. ఈ గొడవ పెరిగి పెద్దదవటంతో చెవిరెడ్డి, ఇతర పార్టీ నేతలు లోపలికి దూసుకెళ్ళి రభస చేసినట్లు చెబుతున్నారు. గాయపడ్డ మేనేజర్‌ను తిరుపతి ఆసుపత్రిలో చేర్చారు. ఎయిర్పోర్ట్ సిబ్బంది ఫిర్యాదు మేరకు విమానాశ్రయానికి చేరుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కేసుపెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.