టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితి గా మార్చిన కేసీఆర్ దేశం మొత్తం దున్నేస్తామని చెబుతున్నారు. కొన్ని కారణాల వల్ల మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లోనే పర్యటిస్తున్నటికీ తన వాయిస్ లో కాన్ఫిడెన్స్ ను ఆయన ఎప్పుడూ తగ్గించరు. ఎర్రకోటపై జెండా ఎగరేస్తామని ధీమాగా చెబుతూంటారు. అయితే ఆయన కుమారుడు , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మాత్రం అంత నమ్మకం ఉన్నట్లుగా లేదు. కేంద్రంలో వచ్చేది సంకీర్ణమేనని.. అందులో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు.
చేనేతల దినోత్సవం సందర్భంగా కేటీఆర్ హైదరాబాద్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో ప్రసంగించారు. చేనేతలపై జీఎస్టీని తగ్గిస్తామని ఢిల్లీలో చెప్పేందకు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తందని .. తగ్గిస్తుందని నమ్మకంగా చెప్పలేకపోయారు. అలా చెబితే కామెడీ అయిపోతుందని అనుకున్నారేమో కానీ.. కేంద్రంలో సంకీర్ణం వస్తందని.. కేంద్ర ప్రభుత్వంలో బీఆర్ఎస్ కీలకమవుతుందని చెప్పుకొచ్చారు.
ప్రతీ ప్రాంతీయ పార్టీ లక్ష్యం.. ఇదే. పది, పదిహేను సీట్లు సాధించి.. తమ సీట్లే కీలకం కావాలని కోరుకుంటారు. కేటీఆర్ కూడా ఆ స్థాయిలోనే ఉన్నారు. కానీ బీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చారు. అయినా ఆయన అదే ఆలోచల్లో ఉండటం మాత్రం బీఆర్ఎస్ నేతల్ని కూడా ఆశ్చర్య పరుస్తోంది. ఏదో ఓ కూటమిలో చేరడం ఖాయం కాబట్టి మందే ఏ కూటమో చెప్పుకోవచ్చు కదా అన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఏ కూటమిలో కీలకం అవుతామో ఆ కూటమిలో చేరుతారన్న వ్యూహం అమలు చేస్తున్నారు. మొత్తంగా ఎర్రకోటపై జెండా అనే ఆలోచనను కేటీఆర్ సీరియస్గా తీసుకోలేదన్నమాట.