సోమవారం టాలీవుడ్ లో కీలకమైన సమావేశం జరగబోతోంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో.. టాలీవుడ్ లోని అన్ని రంగాల ప్రతినిథులూ పాల్గొంటారు. చిరంజీవి అధ్యక్షతన ఈ మీటింగ్ జరగబోతోందని టాక్. ఇటీవల చిరు సీఎం జగన్‌ని కలిశారు. ఆ మీటింగ్‌కి సంబంధించిన విషయాలూ, ఆ తరవాత జరిగిన పరిణామాల గురించి ఈ సమావేశంలో చర్చిస్తారు. ఈ వేసవిలో రాబోతున్న సినిమాల గురించి కొంత గందరగోళం ఉంది. ఒక్కో సినిమాకీ రెండు మూడు రిలీజ్ డేట్లు బ్లాక్ చేశారు. నాని – `అంటే.. సుందరానికి` కోసం ఏకంగా ఏడు రిలీజ్ డేట్లు ప్రకటించారు. వీటిపై కూడా ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కూడా తెలుగు చిత్రసీమ తరపున కలవాలని అనుకుంటున్నారు. ఆ సంగతీ తేలే అవకాశం ఉంది.
* కోలుకున్న చిరు
ఇటీవల కరోనా బారీన పడిన చిరంజీవి ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. తాజా పరీక్షల్లో ఆయనకు నెగిటీవ్ వచ్చింది. ఇప్పుడు షూటింగుల్లోనూ పాలు పంచుకుంటున్నారు. ప్రస్తుతం `గాడ్ ఫాదర్` సెట్లో ఉన్నారాయన. త్వరలోనే `భోళా శంకర్` షూటింగ్ కూడా మొదలవ్వనుంది.