పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ జీవిత కథ ఆధారంగా రూపొందించిన బాగిని అనే సినిమా రూపొందింది. ఈ సినిమాను వచ్చే నెల 3న విడుదల చేసేందుకు నిర్మాతలు రెడీ అయ్యారు. దీనిపై బీజేపీ, లెఫ్ట్ నేతలు.. ఈసీకి ఫిర్యాదు చేశారు. సినిమా ఆపాలని డిమాండ్ చేశారు. బాగిని అంటే బెంగాల్ ఆడపులి. బెంగాలీభాషలో దీన్ని రూపొందించారు. సినిమా విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో మిగతా పార్టీలు ఈసీకి ఫిర్యాదులు పంపాయి. ఆ సినిమా మమత బెనర్జీ బయోపిక్ అని.. దాన్ని ఆపాలని కోరారు.
సినిమాలో.. మమతా బెనర్జీ రూపుతోనే ప్రధానపాత్ర ఉంటుంది. తెల్లదుస్తుల్లో హవాయ్ చెప్పులతో కనిపించే మహిళా.. అచ్చం మమత బెనర్జీని పోలి ఉన్నారు. ఈ కేరక్టర్‌ను రుమా చక్రవర్తి పోషించారు. రైతుల కోసం పోరాడుతున్న విజువల్స్ ఈ ట్రైలర్లో ఉన్నాయి. నరేంద్రమోదీ బయోపిక్‌పై ఈసీ ఇప్పటికే నిషేధం విధించింది. ఎన్నికలకు ముగిసే వరకు సినిమా విడుదల చేయవద్దని ఆదేశించింది. అయితే నిర్మాతలు మాత్రం బ్యాన్‌ను వ్యతిరేకిస్తున్నారు. సినిమాను కేవలం మమత బెనర్జీని స్ఫూర్తిగా తీసుకొని మాత్రమే తీశామని.. అంతేకాని.. బయోపిక్ కాదంటున్నారు. వాస్తవానికి మే 3న సినిమా విడుదల ప్లాన్ చేసుకున్నారు. అయితే సినిమా విడుదల తర్వాత బెంగాల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు
బయోపిక్‌లు అంటే.. గొప్పగా చెప్పుకోవడానికి కాదు… చెడుగా చిత్రీకరించడానికి కూడా… అన్నట్లుగా మారిపోయాయి. తమ గురించి గొప్పగా చెప్పుకోవడం కోసం ఓ సినిమా… పక్క పార్టీల గురించి చెడుగా ప్రచారం చేయడం గురించి మరో సినిమా.. అలా తీస్తూ పోయాయి. రాజకీయ పార్టీలు. మోడీని గొప్పగా చూపించుకునేందుకు నరేంద్రమోడీ తీయగా.. గాంధీ ఫ్యామిలీపై చెడు అభిప్రాయం కలిగేలా.. యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ను తీశారు. ఏపీలో ఎన్టీఆర్స్ లక్ష్మిపార్వతి తీశారు. ఇలా.. ఈ సారి రాజకీయాల్లోనూ సినిమాలొచ్చేశాయి.