ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న జగన్మోహన్ రెడ్డి.. అమరావతిలో అత్యంత భారీ స్కాం జరిగిందని.. సంచలనాత్మక రీతిలో దాన్ని బయట పెట్టబోతున్నామని… ప్రకటించారు. అమరావతి నిర్మాణం కొనసాగింపు… రాజధాని వ్యవహారంలో… ప్రభుత్వ విధానం ఏమిటో స్పష్టం చేయలేదు కానీ… అందులో అవినీతి జరిగిందని.. దాని సంగతేమిటో తేల్చాలని మాత్రం డిసైడయ్యారు.
40వేల ఎకాల కబ్జా గుట్టు బయటకు వస్తుందా..?
అమరావతిలో లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని.. జగన్మోహన్ రెడ్డి నమ్మకం. రాజధాని వస్తుందని తెలిసి… చాలా మంది.. టీడీపీ నేతలు.. ఆ చుట్టుపక్కల భూములు కొన్నారని… ఆ తర్వాతే రాజధానని ప్రకటించారని… జగన్ చెబుతున్నారు. దానికి సంబంధించిన స్కాం మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి బయట పెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. రెండు, మూడేళ్ల క్రితం… సాక్షి దినపత్రిక… నలభై వేల ఎకరాలను.. టీడీపీ నేతలు కబ్జా చేశారని… భారీ కథనాలు రాశారు. బహుశా… వాటికి సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలతో… జగన్మోహన్ రెడ్డి… స్కాంను బయటపెట్టి.. దోషులపై కేసులు నమోదు చేసే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
భూపందేరాలన్నీ రద్దు చేస్తారా..?
అంతే కాదు.. ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన భూములకు సంబంధించి.. పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని జగన్ నమ్ముతున్నారు. అమరావతిలో.. ఎవరికి పడితే వారికి.. చాలా కొద్ది మొత్తంతో అత్యంత విలువైన భూములు కట్టబెట్టారని… జగన్ చెబుతున్నారు. ఆ భూ పంపిణీ నిర్ణయాలన్నింటినీ… జగన్ సమీక్షించే అవకాశం ఉంది. చంద్రబాబునాయుడు.. విదేశీ వైద్య విద్య సంస్థలతో పాటు.. పలు యూనివర్శిటీలు, ఇతర వాటికి.. పెద్ద ఎత్తున భూములు కేటాయించారు. కొన్ని పనులు ప్రారంభించాయి. చాలా కంపెనీ ఇంకా మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎదురు చూస్తున్నాయి. దీంతో ఈ ఒప్పందాలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి రద్దు చేసే అవకాశం ఉంది. వాటి వెనుక ఏదైనా అవినీతి జరిగితే వెలికి తీసే అవకాశం ఉంది.
గుదిబండ లాంటి నిర్మాణాలు కొనసాగింపు అనుమానమే..!
రాజధాని నిర్మాణం కొనసాగింపు విషయంలో.. జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఏమిటో ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. గతంలో మేనిఫెస్టోలో పెడతామన్నారు కానీ పెట్టలేదు. ఎప్పుడు అమరావతి ప్రస్తావన వచ్చినా… భారీ కుంభకోణం జరిగిందనే చెబుతున్నారు. ఇప్పుడు ఆ కుంభకోణాన్ని బయట పెట్టాలనుకుంటున్నారు. ఇప్పటికే ప్లానింగ్‌లో ఉన్న నిర్మాణాలు… శాశ్వత సచివాలయ భవనాలు, హైకోర్టు వంటి వాటి నిర్మాణాలు కొనసాగిస్తారో లేదో .. సమీక్షల తర్వాత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.