ఈరోజు టాలీవుడ్ లో ఓ కీలక మీటింగ్ జరగాల్సింది. ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో.. టాలీవుడ్ కి చెందిన అన్ని రంగాల నుంచీ, ప్రముఖులు ఈ మీటింగ్ లో పాల్గొనాల్సింది.కానీ… కొన్ని కారణాల వల్ల ఈ మీటింగ్ వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారన్నది తెలీలేదు. కీలకమైన సభ్యులు అందుబాటులో లేకపోవడం వల్ల, ఈ మీటింగ్ నిర్వహించడం లేదని ఛాంబర్ తెలిపింది. ఛాంబర్ ఆధ్వర్యంలో చిరంజీవి అధ్యక్షతన ఓ మీటింగ్ నిర్వహించాలని, ఆ మీటింగ్ లో విడుదల తేదీల సమస్యతో పాటు, ఏపీలో టికెట్ రేట్ల వ్యవహారం దగ్గర్నుంచి థియేటర్ల సర్దుబాటు వరకూ అన్నీ మాట్లాడుకోవాలని అనుకున్నారు. నిజానికి ఈ మీటింగ్ ఎప్పుడో జరగాల్సింది. కానీ చిరుకి కరోనా సోకడంతో సాధ్యం కాలేదు. ఇప్పుడు కరోనా నుంచి చిరు కోలుకున్నా, ఇతరత్రా కారణాల వల్ల వీలు కావడం లేదు.