ఓ పాత కాలం నాటి ఫోన్ ట్రింగ్ ట్రింగ్ అని మోగుతోంది. ఫోన్ మోగడం విచిత్రం కాదు. కానీ.. దానికి ఎలాంటి కనెక్షన్ లేకుండా మోగడమే విచిత్రం. అంతేనా..? అవతల ఓ అమ్మాయి గొంతు. ఆమె ఈకాలానికి చెందిన అమ్మాయి కాదు. ఇంకా గతంలోనే ఉన్న అమ్మాయి. తాను భవిష్యత్తులో ఉన్న అబ్బాయికి కాల్ చేస్తుంది. కాన్సెప్టు విచిత్రంగా ఉంది కదూ. `ప్లే బ్యాక్` సినిమా పాయింట్ ఇది. రెండు విభిన్న కాలాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రేమలో పడితే ఎలా ఉంటుందో చూపిస్తున్నారు.చిన్న సినిమాలకు కథే బలం. పాయింట్ కొత్తగా ఉంటే చాలు. స్టార్లు లేకున్నా ఫర్వాలేదు. ఇప్పుడు ఆ కథాబలంతోనే ఈసినిమా తెరకెక్కించామంటున్నారు దర్శక నిర్మాతలు. శుక్రవారమే.. ట్రైలర్ విడుదలైంది. అందులో కాన్సెప్టు అందరినీ ఆకట్టుకుంటోంది. మరి గతానికీ, భవిష్యత్తుకీ లింకేసిన ఆ ఫోన్ లో ఉన్న మ్యాజిక్ ఏమిటో తెలియాలంటే సినిమా రావాల్సిందే.
దినేష్ తేజ్ హీరోగా అనన్య నాగళ్ళ జంటగా నటించిన చిత్రమిది. హరి ప్రసాద్ జక్కా దర్శకత్వం వహించారు. మార్చి 5న ఈ చిత్రం విడుదల కాబోతోంది. కొత్త కాన్సెప్టులకు పట్టం కట్టే తెలుగు ప్రేక్షకులు.. ఈ ప్లే బ్యాక్ కి ఎలాంటి స్థానం ఇస్తారో చూడాలి.