ఈ మధ్య తెలంగాణలో మరో కొత్త దిన పత్రిక పుట్టింది. రంగుల పేజీల్లో.. కొంత కాలంగా అలరిస్తోంది. ఇప్పుడు ఆ పత్రిక వైభోగం మూడు నాళ్ల ముచ్చటగానే మిగిలిపోనున్నదని మీడియా వర్గాల్లో టాక్. ముందు నుంచీ ఈ పత్రికకు ప్రకటనలు అంతంతమాత్రమే. లాక్డౌన్ కారణంగా అవీ చేజారిపోయాయి. గత రెండు నెలలుగా ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. ఇప్పుడు కరోనా ఎఫెక్టు కూడా తోడైంది. కొంతమంది స్వచ్ఛందంగానే ఉద్యోగాలు వదులుకుంటున్నారని టాక్. త్వరలో ఈ పత్రిక ని మరెకరు హ్యాండోవర్ చేసుకుంటారని, అప్పటి వరకూ ఈ కష్టాలు తప్పవని ఉద్యోగులే చెప్పుకుంటున్నారు.
నమస్తే తెలంగాణ లాంటి పత్రికకీ కష్టనష్టాలు తప్పడం లేదు. కనీసం 20 నుంచి 30 శాతం ఉద్యోగులకు త్వరలో ఉద్యోగ గండం ఉందన్నది ఇన్సైడ్ వర్గాల టాక్. జిల్లా టాబ్లాయిడ్లు ఇప్పుడు నవడం లేదు. అందులో పనిచేసే ఉద్యోగులకు హూస్టింగ్ తప్పదని తెలుస్తోంది. బాగా పనిచేసే కొద్ది మందిని మాత్రం ఉంచుకుని, మిగిలిన వాళ్లని ఇంటికి పంపించే యోచనలో యాజమాన్య ఉందని సమాచారం. ఈ నెలఖరులోగా చాలా ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశంఉందని మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.