ఇంట్లో దొంగతనం చేసి, మీరేం బాధపడకండి… నెల రోజుల్లో మీవన్ని తిరిగి ఇచ్చేస్తానంటూ ఓ దొంగ లెటర్ రాసిపెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తమిళనాడులోని తూత్తుకుడిలో ఈ విచిత్రమైన సంఘటన జరిగింది. మేఘ్నాపూరంలో రిటైర్డ్ అధికారులు కాపురం ఉంటున్నారు. పిల్లలు అందరికీ పెళ్లిళ్లు కావటం, ఉద్యోగ నిమిత్తం వారంతా ఇతర పట్టణాల్లో ఉంటున్నారు. వారిని చూసేందుకు వీరు వెళ్లగా వచ్చే సరికి ఇంట్లో ఉన్న 2తులాల బంగారం, 60వేల రూపాయలు దొంగతనం అయ్యాయి. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఇంట్లోనే ఓ లెటర్ దొరికింది.
నేను అమ్మకు వైద్యం చేయించాల్సి ఉంది. నా లవర్ బర్త్ డే కూడా ఇప్పుడే ఉంది. నా దగ్గర డబ్బులు లేకపోవటంతోనే ఈ దొంగతనం చేస్తున్నానని, మీరేం బాధపడవద్దు… నెల రోజుల్లో తిరిగి ఇచ్చేస్తానంటూ లెటర్ లో రాసి పెట్టాడు. లెటర్ చూసి పోలీసులు, ఆ ఇంటి వాళ్లు కూడా షాక్ అయ్యారు.
ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.