వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా మారుతోంది.
ఉదాహరణకు.. వైఎస్సార్ చేయూత పథకం 8 విడతల్లో రూ.75 వేల నుంచి రూ. లక్షా 50 వేలకు పెంపు అని ప్రకటించారు. చేయూత పథకం ఇప్పటికి నాలుగు సార్లు ఇచ్చారు. మళ్లీ గెలిస్తే ఇంకో సార్లు సార్లు ఇస్తారు. మొత్తం కలిపి లక్షన్నర అవుతుంది. అంటే ఇప్పటి వరకూ ఇచ్చినవి కూడా కలిపుతారు. అంటే.. జగన్ మళ్లీ గెలిచినా వచ్చేది రూ. 75 వేలే. ఇలాగే అన్ని పథకాల్లోనూ ట్విస్ట్ పెట్టారు. వైఎస్సార్ కాపు నేస్తం రూ.లక్షా 20వేలకు పెంపు, ఎస్సార్ ఈబీసీ నేస్తం రూ. లక్షా 5 వేలకు పెంపు ఇలా పథకాల సొమ్మ రెట్టింప చేస్తామని ప్రతీ పథకంలోనూా ఇదే ట్విస్ట్ ఉంది.
వైసీపీ నేతలకు ఇంటింటి ప్రచారానికి వెళ్లినప్పుపు కాపు నేస్తు ఇప్పుడు ఇస్తున్నదానికి రెట్టింపుగా ఏడాదికి రూ. 35 వేలు ఇస్తారా అంటే.. సమాధానం చెప్పలేకపోతున్నారు. దీంతో అనుమానాలు ప్రారంభమయ్యాయి. వైసీపీ హైకమాండ్ కూడా రెట్టింపు సొమ్మ ఇస్తామంటే..ఈ ఐదేళ్లలో ఇచ్చినంత వచ్చే ఐదేళ్లలో ఇస్తాం.. అదే రెట్టింపు అని చెబుతోంది. ఇంత కన్నా పచ్చి మోసం ఏముంటుందని వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా గొణుక్కుంటున్నారు.
నిన్నటిదాకా పథకాలు అవే అయినా రెట్టింపు చేస్తున్నారు కదా అని జనం అనుకుంటూ వస్తున్నారు. కానీ అసలు విషయం ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. దీంతో లబ్దిదారుల్లో, ప్రజల్లో విస్తృతమైన చర్చ ప్రారంభమయింది. ఇంత మోసమా అని అందరూ బుగ్గలు నొక్కుకోవాల్సి వస్తోంది.