తిరుపతి జనసేన పార్టీ నేతపై ఓ మహిళ ఆరోపణలు చేశారు. బెదిరించి, మోసం చేసి, అన్ని విధాలుగా వాడుకొని, కోటి రోపాయలకు పైగా డబ్బులు కాజేశారని ఆమె వీడియో రిలీజ్ చేశారు. తిరుపతి బైరాగపట్టడుగు చెందిన లక్ష్మీ అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. తనకు కిరణ్ రాయల్ తో సన్నిహిత సంబంధం ఉందని.. ఆమె చెప్పుకుంది. అనేక దఫాలుగా కోటి 20 లక్షల రూపాయల వరకు కిరణ్ రాయల్ కు అప్పుగా ఇచ్చానని చెప్పారు. అయితే తాను ఇచ్చిన డబ్బులను కిరణ్ రాయల్ తిరిగి ఇవ్వడం లేదని ఆమె అంటున్నారు.
2022 సంవత్సరం నుంచి కిరణ్ రాయలకు లక్ష్మి మధ్య వివాదం జరుగుతోందని తెలుస్తోంది. కిరణ్ రాయల్ తనను మోసం చేశారని తనను బెదిరించి 30 లక్షల రూపాయలకు చెక్కులు బాండ్లు రాయించుకున్నారని ఆరోపించింది. డబ్బులు అడిగితే తన పిల్లలను చంపుతాడని బెదిరిస్తున్నానని ఆరోపించారు. కిరణ్ రాయల్ వలనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని తాను చనిపోయిన తర్వాత అయినా తన డబ్బులు తన పిల్లలకు చెందాలని కోరింది. ఈ వీడియో వైరల్ గా మారింది.
ఆత్మహత్యాయత్నం చేయడంతో ఆమెను ప్రస్తుతం వేలూరు ఆస్పత్రిలో చేర్పించినట్లుగా తెలుస్తోంది. ఈ వివాదంపై కిరణ్ రాయల్ స్పందించ లేదు. ఆమెతో ఆర్థిక పరమైన వివాదాలు ఉన్నాయని.. డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా బెదిరించి తీసుకునేందుకు ఇలాంటి వీడియోలు రిలీజ్ చేస్తున్నారని కిరణ్ రాయల్ తన సన్నిహితులతో చెబుతున్నట్లుగా తెలుస్తోంది.