ఎంత గొప్ప స్టార్ అయినా బడ్జెట్ పరిధుల్లోనే సినిమా తీయాలి. సినిమా హిట్టయినా కాస్ట్ ఫెయిల్యూర్ వల్ల నష్టపోయిన సందర్భాలు కోకొల్లలు. పెద్ద స్టార్ల పరిస్థితే ఇలా ఉంటే.. మరి అప్ కమింగ్ హీరోల మాటేంటి? వాళ్లెంత జాగ్రత్తగా ఉండాలి?? కానీ ఆది సినిమా విషయంలో ఈ సీన్ రివర్స్ అయ్యింది. ఆది కథానాయకుడిగా వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చుట్టాలబ్బాయ్. ఈ సినిమా బడ్జెట్ మరీ తడిసిమోపెడయ్యిందని టాక్. రూ.4 కోట్లతో ఈ సినిమా పూర్తి చేస్తానని నిర్మాతలకు వీరభద్రమ్ మాటిచ్చాడట. ఆది మార్కెట్, శాటిలైట్ కలుపుకొని చూస్తే.. ఫర్వాలేదు అనిపించగలిగే బడ్జెట్ ఇది. కానీ ఈ సినిమా పూర్తయ్యేసరికి రూ.8 కోట్ల లెక్క తేలిందట.
అంటే.. రెండు రెట్లు పెరిగిందన్నమాట. ఇంకా.. పబ్లిసిటీకి కొంత ఖర్చు పెట్టాలి. ఆది సినిమా ఎంత హిట్టయినా అంత రాబట్టడం కష్టమే. పైగా ఆదికి వరుస ఫ్లాపులు తగిలాయి. ఈ నేపథ్యంలో.. చుట్టాలబ్బాయ్ ఎక్కడ తేలతాడో అన్న కంగారు పట్టుకొంది. ఈ రోజుల్లో చిన్న సినిమా హిట్టయితే డబ్బులు బాగానే వస్తున్నాయి కదా.. ఆ సెంటిమెంట్ చుట్టాలబ్బాయ్కి వర్కవుట్ అయితే తప్ప.. ఈ కష్టాల నుంచి గట్టెక్కలేడు ఆది.